వారెవ్వా.. వంటింట్లో కుక్కర్‌ని ఇలా కూడా వాడొచ్చా..? ఇది చూస్తే అక్కకు దండం పెట్టాల్సిందే..!

ఈ వైరల్ వీడియో మనకు సరైన సాధనాలు, పరికరాలను అవసరాలకు తగినట్టుగా ఉపయోగించడం ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. ముఖ్యంగా వేడి, ఆవిరితో చేసే పనుల్లో ఇలాంటి అల్ట్రనెటివ్స్‌ అప్పటిప్పుడు ఉపయోగంగా ఉంటాయని కూడా కొందరు నెటిజన్లు చెబుతున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ సందడి చేస్తోంది.

వారెవ్వా.. వంటింట్లో కుక్కర్‌ని ఇలా కూడా వాడొచ్చా..? ఇది చూస్తే అక్కకు దండం పెట్టాల్సిందే..!
Pressure Cooker
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 13, 2024 | 11:54 AM

అవసరం మనకు అనేకం నేర్పిస్తుంది. కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. మన దేశంలో అలాంటివి ఎన్నో దేశీ జుగాడ్‌లను చూస్తుంటాం. సోషల్ మీడియాలో పుణ్యమా అని నిత్యం దేశీ జుగాడ్‌ వీడియోలు అనేకం వైరల్‌ అవుతుంటాయి. జుగాడ్‌ పేరుతో ప్రజలు ఏం చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తాజాగా అలాంటిదే మరొక వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో చర్చనీయాంశమైంది. వీడియోలో ఒక గృహిణి చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేసేందుకు ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించింది. వైరల్ అయిన వీడియో చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ప్రెషర్ కుక్కర్‌ని వాడినందుకు పలువురు మహిళను ట్రోల్ చేశారు.

ఈ వీడియో శుభాంగి పండిట్ అనే X ఖాతా ద్వారా షేర్‌ చేయగా, వైరల్‌గా మారింది. మహిళ కుక్కర్‌లో నీళ్లు పోసి విజిల్‌ వచ్చేంతవరకు వేడి చేసింది. ఆ తర్వాత వేడేక్కిన ఆ కుక్కర్‌తో చొక్కాను ఇస్త్రీ చేస్తుంది. ఐరన్‌ బాక్స్‌కు బదులుగా ఆమె కుక్కర్‌ని ఉపయోగించడం పట్ల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇలా ప్రెషర్ కుక్కర్ వాడటం ఎంత ప్రమాదకరమో అంటూ ఈ వీడియోపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇస్త్రీ కోసం వేడి ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు మహిళ చేసిన పనిని తీవ్రంగా ఖండించారు. వేడి వస్తువులతో పనులు చేసేటప్పుడు భద్రత, జాగ్రత్తలను విస్మరించకూడదని సలహా ఇచ్చారు. ఇలాంటి పనులు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమేనని, తరచూ ఇలాంటి చర్యలు ప్రమాదాలకు దారి తీస్తాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియో మనకు సరైన సాధనాలు, పరికరాలను అవసరాలకు తగినట్టుగా ఉపయోగించడం ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. ముఖ్యంగా వేడి, ఆవిరితో చేసే పనుల్లో ఇలాంటి అల్ట్రనెటివ్స్‌ అప్పటిప్పుడు ఉపయోగంగా ఉంటాయని కూడా కొందరు నెటిజన్లు చెబుతున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ సందడి చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..