Viral: పోలీసుల సంచలన నిర్ణయం.. వాహనదారులకు ఆస్కార్ అవార్డ్స్.. అసలు మ్యాటర్ ఇదే
మనదేశంలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. వాహనదారులు మాత్రం లైట్ మామా అంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు. పోలీసులు చలాన్స్ విధిస్తున్నా.. ఆదేశాలు బేఖతారు చేస్తుంటారు. సిగ్నల్ జంప చేస్తూ, త్రిబుల్ రైడ్ చేస్తూ రూల్స్ ను బ్రేక్ చేస్తుంటారు. ఈ వ్యవహరంపై ఢిల్లీ పోలీసులు ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు.
మనదేశంలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. వాహనదారులు మాత్రం లైట్ మామా అంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు. పోలీసులు చలాన్స్ విధిస్తున్నా.. ఆదేశాలు బేఖతారు చేస్తుంటారు. సిగ్నల్ జంప్ చేస్తూ, త్రిబుల్ రైడ్ చేస్తూ రూల్స్ ను బ్రేక్ చేస్తుంటారు. ఈ వ్యవహరంపై ఢిల్లీ పోలీసులు ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. మీమ్స్, ఫన్నీ కొటేషన్స్ తో రియాక్ట్ అవుతుంటారు. తాజాగా మరోసారి వెరైటీ కాన్పెస్ట్ తో ఢిల్లీ పోలీసులు ముందుకొచ్చారు. అద్బుత సందేశాలతో హాస్యాన్ని మేళవించడంలో ఢిల్లీ పోలీసులకు నైపుణ్యం ఉంది. తాజాగా వీరి ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాహనదారులకు ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాం.. హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ స్పందించారు.
మార్చి 12న ఢిల్లీ పోలీసులు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నవ్వులు పూయించారు. నిబంధనలను ఉల్లంఘించేవారికి ఝలక్ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. “రూల్స్ బ్రేక్ చేసినవారికి ఆస్కార్ వస్తుంది..”బెస్ యాహిన్ తక్ జానా థా, ఇస్లియే హెల్మెట్ నహీ లగాయా” అని అంటూ క్యాప్షన్ ఇచ్చారు. హెల్మెట్ ఖరీద్నే జా రహా హు (నేను హెల్మెట్ కొనబోతున్నాను)” అని ఒక యూజర్ అన్నారు.
‘సర్ మై తో పిచా బైతా థా (సర్, నేను వెనుక కూర్చున్నాను)’ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. “సర్ హాస్పటల్ జ రహ థా, ఎమర్జెన్సీ హెచ్ (సర్, నేను హాస్పిటల్ కి వెళ్తున్నా. ఎమర్జెన్సీ ఉంది) అని మరొకరు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు 8,000 చలాన్లు జారీ చేశారు. రాజధానిలో బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేసిన ప్రయాణికులపై, 452 చలాన్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు 401 చలాన్లతో భజన్ పురా రెండో స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో బైక్ పై ట్రిపుల్ రైడింగ్ కు 8,015 చలాన్లు జారీ కాగా, 2023లో 6,225, 2022లో 4,216 చలాన్లు జారీ అయ్యాయి. ఢిల్లీలోని 10 ప్రాంతాల్లో అత్యధికంగా ట్రిపుల్ రైడింగ్ కేసులు పశ్చిమ ప్రాంతంలో నమోదయ్యాయి.