TV9 Global Summit: జూన్ 17 నుంచి TV9 థింక్-ఫెస్ట్‌.. కీలకోపన్యాసం చేయనున్న అమిత్ షా.. పాల్గొననున్న డేవిడ్ కామెరూన్, హమీద్ కర్జాయ్

TV9 Global Summit: జూన్ 17న TV9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న 'వాట్ ఇండియా థింక్స్ - గ్లోబల్ సమ్మిట్'పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలకోపన్యాసం చేస్తారు. జూన్ 18న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు.

TV9 Global Summit: జూన్ 17 నుంచి TV9 థింక్-ఫెస్ట్‌.. కీలకోపన్యాసం చేయనున్న అమిత్ షా.. పాల్గొననున్న డేవిడ్ కామెరూన్, హమీద్ కర్జాయ్
Tv9 Global Summit
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jun 17, 2022 | 11:49 AM

TV9 Global Summit: జూన్ 17న TV9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ‘వాట్ ఇండియా థింక్స్(What India Thinks Today) – గ్లోబల్ సమ్మిట్’పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలకోపన్యాసం చేయనున్నారు. జూన్ 18న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. ఈ సమ్మిట్‌లో UK మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో సహా 75 మంది స్టార్ స్పీకర్లు పాల్గొంటున్నారు. థింక్-ఫెస్ట్ ప్రారంభ ఎడిషన్ థీమ్ ‘విశ్వ గురు: ఇంకెంత దూరంలో’ అనే అంశంపై వక్తలు ప్రసగించనున్నారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌ వేధికగా జూన్ 17, 18 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.

“ఈ సమ్మిట్లో ప్రధానంగా రాజకీయాలు, గవర్నెన్స్, ఎకనమిక్స్, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, క్రీడల రంగాలకు చెందిన అంశాలపై చర్చ జరగనుంది. ఇందుకోసం అత్యంత ప్రభావవంతమైన, విశిష్ట అంతర్జాతీయ, జాతీయ స్థాయి వక్తలను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. ఇది రెండు రోజుల పాటు 75 మంది స్టార్ స్పీకర్లకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు” TV9 నెట్‌వర్క్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది కొంతమంది ప్రసిద్ధ విధాన రూపకర్తలు, కేంద్ర క్యాబినెట్ మంత్రులు ఇందులో హాజరుకానున్నారు. అయితే సీనియర్ ముఖ్యమంత్రులు కూడా సమ్మిట్‌లో ప్రసంగించనున్నారు.

‘టీవీ9 గ్రూప్ నిర్వహించిన మొదటి గ్లోబల్ సింపోజియమ్‌కు హాజరుకావడం ఆనందంగా ఉంది. భారతదేశంలోని చురుకైన వ్యక్తులు ప్రపంచ సవాళ్లు, అవకాశాల గురించి సమాశంలో మాట్లాడతారు. నేను ప్రధానిగా ఉన్నప్పుడు ఇంగ్లండ్, భారత్ మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశాను. దీనికి నేను గర్విస్తున్నాను. 2010లో మొదటిసారిగా ట్రేడ్ మిషన్ ద్వారా నేను భారతదేశానికి వచ్చాను. ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యానికి, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మధ్య నిజమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాను. రెండు దేశాల మధ్య ఆధునిక భాగస్వామ్యాన్ని సజీవంగా ఉంచేందుకు ప్రయత్నించాను. దశాబ్దం తర్వాత మళ్లీ భారత్‌లో పర్యటించడం ఆనందంగా ఉంది. నేటికీ నాటికి భారత్ చాలా మారిపోయింది. కానీ రెండు దేశాల మధ్య బంధం నేటికీ అలానే బలంగా ఉంది. ఈ సదస్సులో పది అంశాలపై చర్చ జరగనుంది. నేను ఈ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను ”అని కామెరూన్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ‘టెర్రరిజం ఎనిమీ ఆఫ్ హ్యుమానిటీ’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. “తాను TV9 కార్యక్రమంలో పాల్గొనడానికి, భారత్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య పరస్పర ప్రయోజనాలపై చర్చించడానికి ఎదురుచూస్తున్నాను” అని కర్జాయ్ అన్నారు.

ఇదే సమయంలో.. విశ్వగురువుగా ఎదిగేందుకు భారత్ చేస్తున్న ప్రయాణానికి సంబంధించిన బ్లూప్రింట్‌పై థింక్-ఫెస్ట్ నిర్వహించబడుతోందని TV9 CEO బరున్ దాస్ పేర్కొన్నారు. భారతదేశ ప్రయాణం సవాళ్లు లేనిది కాదని, కానీ.. లక్ష్యం అంతకంటే పవిత్రమైనదని అన్నారు. ప్రతిష్టాత్మకమైన, బలమైన నాయకత్వం, సమష్టి సంకల్పం మొత్తం దేశాన్ని నిబద్ధతతో నడుపబడుతోందని వ్యాఖ్యానించారు. భారతదేశం ‘విశ్వ గురువు’గా మారాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి స్వేచ్ఛా వాతావరణంలోని చర్చల ద్వారా ఆలోచనలను రూపొందించడమే.. ఈ ఈవెంట్ అంతిమ లక్ష్యమని దాస్ స్పష్టం చేశారు.

మొత్తం 15 మంది కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా ఈ అంశంపై తమ విజన్‌ను కార్యక్రమంలో పంచుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. ఈ ఈవెంట్‌లో “అవకాశాలు, ప్రతికూల సమయాల్లో భారత్ కొత్త ప్రపంచ క్రమాన్ని ఎలా విజయవంతంగా ఎదుర్కొంది అనే దానిపై చర్చలు జరుగుతాయి. అలాగే మనం సరైన స్థలం కోసం ఆకాంక్షిస్తున్నప్పుడు మనకు తెలిసిన, తెలియని సవాళ్లను ఈ చర్చల ద్వారా పంచుకోవచ్చని టీవీ9 నెట్వర్క్ అభిప్రాయపడింది.