మహాకుంభమేళాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుణ్య స్నానమాచరించారు. పవిత్ర స్నానం చేసిన అమిత్ షాకు సాధు ప్రముఖలు తిలకం దిద్దారు. ఆయనతోపాటు ఆయన చిన్నారి మనవడికి కూడా సాధు సంతువులు తిలకం దిద్దారు. ICC చీఫ్ జై షా కుమారుడు ఈ ప్రోగ్రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ చిన్నారిని సాధువులు ఆశీర్వదించారు.
#WATCH | #MahaKumbh2025 | Union Home Minister Amit Shah takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh. pic.twitter.com/xyCiwqIM3Z
— ANI (@ANI) January 27, 2025
అమిత్ షా, తన సతీమణి సోనాల్ షా, కుమారుడు జై షా, తన చిన్నారి మనవడు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి త్రివేణి సంగమ ఘాట్ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం సాగింది. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి అమిత్ షా అర్చన చేశారు. గంగామాతకు హారతి ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో ఇది 15వ రోజు. ఇప్పటికే కుంభమేళాకు 13 కోట్లకుపైగా భక్తులు హాజరయ్యారు. ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళాకు ప్రధాని మోదీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు అమిత్ షా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళ వచ్చే నెల 26 వరకు కొనసాగుతోంది. విభుడు, దేవాదిదేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృత కాలమే మహా కుంభమేళ. ఈ 45 రోజుల్లో ఏ రోజున అయినా త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భువి నలుచెరుగుల నుంచి సాధుసంతులు, అఘోరాలు, మాన్యులు, సామాన్యులు ప్రయాగ్ రాజ్‌కు పోటెత్తుతున్నారు. ఈ నెల 29న మహాకుంభమేళలో అద్వీతియమైన రోజు. బుధవారం మాఘ మాస మౌని అమావాస్య మహిమాన్వితమని చెప్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.