అప్పుడు శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పలేదు.. ఏం చేసినా బహిరంగంగానే చేస్తాం: అమిత్ షా

Amit Shah on Shiv Sena: మహారాష్ట్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి విషయంలో తాము ఎలాంటి హామీ..

అప్పుడు శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పలేదు.. ఏం చేసినా బహిరంగంగానే చేస్తాం: అమిత్ షా
Follow us

|

Updated on: Feb 08, 2021 | 7:28 AM

Amit Shah on Shiv Sena: మహారాష్ట్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి విషయంలో తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. తాము ఏం చేసినా బహిరంగంగానే చేస్తామని.. రహస్య రాజకీయాలు ఉండవని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇచ్చిన హామీలను తాము గౌరవిస్తామంటూ అమిత్‌ షా చెప్పారు. ఆదివారం మహారాష్ట్ర సింధుదుర్గ్‌ జిల్లాలోని కంకావ్లిలో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. మొదట మోదీ పేరుతో ఎన్నికల ప్రచారం చేసి, ఓట్లు సంపాదించిన శివసేన చీఫ్‌ ఠాక్రే ఆ తర్వాత మాట మార్చారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

బీహార్‌లో తమకు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఎన్నికల వాగ్దానాన్ని గౌరవిస్తూ నితీశ్‌కుమార్‌కే సీఎం పదవిని ఇచ్చామని గుర్తుచేశారు. అయితే మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వ పాలన తీరు ఆటో రిక్షా మాదిరిగా ఉందని అమిత్‌ షా ఎద్దెవా చేశారు. ఆటో చక్రాల మాదిరిగా సంకీర్ణలోని పార్టీల ధోరణి ఎవరికి వారే అన్నట్టుగా పొంతన లేదని.. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ కూటమి ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఏర్పడిన అపవిత్ర కూటమి అని అది కేవలం అధికారం కోసమే ఏర్పడిందంటూ షా విమర్శించారు.

Also Read: