AIADMK – BJP: తమిళనాట బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు ఖరారు

తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ఖరారైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటించారు. పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థి అని స్పష్టం చేశారు. అధికారం, సీట్ల పంపకాలపై తర్వాత నిర్ణయిస్తామమని చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమన్నారు.

AIADMK - BJP: తమిళనాట బీజేపీ - అన్నాడీఎంకే పొత్తు ఖరారు
AIADMK general secretary Edappadi K Palaniswami With Amit Shah

Updated on: Apr 11, 2025 | 5:34 PM

తమిళనాట బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు ఖరారు అయింది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి వ్యవహరించనున్నారు. రెండు పార్టీల పొత్తుపై బీజేపీ అగ్రనేత అమిత్‌షా ప్రకటన చేశారు. దీంతో అన్నాడీఎంకే అధికారికంగా NDA కూటమిలోకి జాయిన్ అయినట్లయింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను అధికారం నుంచి గద్దె దించేందుకు తమ పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ ముఖ్య ఎన్నికల వ్యూహకర్త అమిత్ షా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. 2026 లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. బహిష్కరించబడిన అన్నాడీఎంకే నాయకులు ఓ పన్నీర్‌సెల్వం, ఏఎంఎంకే నాయకుడు టీటీవీ దినకరన్‌లను కూటమిలో చేర్చుకుంటారా అనే ప్రశ్నకు అమిత్ షా బదులిస్తూ, అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని చెప్పారు.

ఈ రెండు పార్టీలు జట్టు కట్టడంతో.. తమిళనాడు పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నాగేంద్రన్‌ను ఖరారు చేసింది హైకమాండ్. గతంలో అన్నాడీఎంకేలో సుదీర్ఘకాలం పనిచేశారు నాగేంద్రన్.

తమిళనాడు బీజేపీ అధ్యక్ష మార్పుపై అమిత్‌షా ట్వీట్ చేశారు. అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్ దాఖలైనట్లు చెప్పారు. మరోవైపు పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అన్నామలై బీజేపీకి ప్రశంసనీయ సేవలందించారని పేర్కొన్నారు. మోదీ విధానాలు ప్రజలకు చేరవేయడంలో ఆయన సఫలమయినట్లు రాసుకొచ్చారు. జాతీయ స్థాయిలో అన్నామలై నైపుణ్యాలు ఉపయోగించుకుంటామని వెల్లడించారు. అన్నామలై సహకారం మరవలేనిదన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.