Heat wave: వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు.. అత్యవసర సమీక్ష నిర్వహించిన కేంద్రం.

|

Jun 20, 2023 | 2:32 PM

జూన్‌ నెల ముగియడానికి సమయం దగ్గరపడుతున్నా ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా రుతుపవనాల జాడే కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. దీంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వర్షాలు పడక, రుతుపవనాల జాడలేక ప్రజలు..

Heat wave: వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు.. అత్యవసర సమీక్ష నిర్వహించిన కేంద్రం.
Heat Wave
Follow us on

జూన్‌ నెల ముగియడానికి సమయం దగ్గరపడుతున్నా ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా రుతుపవనాల జాడే కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. దీంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వర్షాలు పడక, రుతుపవనాల జాడలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత కారణంగా జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండల కారణంగా వందల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వెంటనే రంగంలోకి దిగింది కేంద్ర ప్రభుత్వం.

ప్రస్తుతం పరిస్థితుపలై కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమీక్షను నిర్వహించింది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యంగా బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బిహార్‌లో పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి.

ఎండల కారణంగా బిహార్‌లో ఇప్పటి వరకు 81 మంది మృతి చెందారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బలియా ఆసుపత్రిలో కూడా మరణాలు కొనసాగుతున్నాయి. సోమవారం మరో 11 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 68కి చేరుకుంది. ఇదిలా ఉంటే విద్యా సంస్థలు సమ్మర్‌ హాలీడేస్‌ ముగించుకొని మళ్లీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎండ తీవ్రత తగ్గని కారణంగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులను పొడిగించాయి. మరికొన్ని చోట్ల ఒంటి పూట బడులను నిర్వహిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..