అంబులెన్స్‌లో కరోనా రోగి మృతి.. డ్రైవర్‌పై దాడి

కరోనా వేళ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్నారు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు. అయితే వారిపై పలుచోట్ల దాడులు జరుగుతున్నాయి.

  • Publish Date - 4:48 pm, Fri, 31 July 20 Edited By:
అంబులెన్స్‌లో కరోనా రోగి మృతి.. డ్రైవర్‌పై దాడి

Attack on Ambulance Driver: కరోనా వేళ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్నారు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు. అయితే వారిపై పలుచోట్ల దాడులు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.  అంబులెన్స్‌ లో కరోనా రోగి చనిపోపోవడంతో.. డ్రైవర్‌పై దాడి చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. 75 ఏళ్ల కరోనా రోగిని ఆసుపత్రికి తరలించేందుకు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు 1080 అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్‌‌ ఆ రోగిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే బెడ్లు ఖాళీగా లేకపోవడంతో ఆ రోగిని అక్కడ అడ్మిట్ చేసుకోలేదు. ఇదిలా ఉంటే అదే సమయంలో అంబులెన్స్‌లో ఉన్న రోగి కన్నుమూశాడు. దీన్ని భరించలేకపోయిన కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఆక్సిజన్ కిట్ ఎందుకు పెట్టుకోలేంటూ డ్రైవర్‌పై దాడి చేశారు. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఈ ఘటనపై సదాశివ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అంబులెన్స్ డ్రైవర్ ఫిర్యాదు చేశారు.

Read This Story Also: కోవిడ్ ఆసుపత్రుల్లోని పడకల వివరాలు ప్రదర్శించండి