Ambani Family: సోషల్ మీడియాలో మరోసారి రచ్చ చేస్తున్న జూనియర్ అంబానీ.. వారసుడి పేరు ఇదేనా..?

వారసుడి రాకతో అంబానీ కుటుంబం ఆనందోత్సాహంలో మునిగి తేలుతోంది. ఆ చిన్నారిని చూసి ఆసియా అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ తాను..

Ambani Family: సోషల్ మీడియాలో మరోసారి రచ్చ చేస్తున్న జూనియర్ అంబానీ.. వారసుడి పేరు ఇదేనా..?
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 25, 2020 | 5:38 AM

Ambani Family: వారసుడి రాకతో అంబానీ కుటుంబం ఆనందోత్సాహంలో మునిగి తేలుతోంది. ఆ చిన్నారిని చూసి ఆసియా అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ తాను తాత అయ్యానని తెగ సంబరపడిపోతున్నారు. జూనియర్ అంబానీని పెద్ద అంబానీ తన చేతిలో ఎత్తుకుని అపురూపంగా తీసుకున్న తొలి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక కృష్ణ భగవానుడి ఆశీర్వాదంతో ఆకాశ్-శ్లోకా తల్లిదండ్రులు అయ్యారంటూ అంబానీ ఫ్యామిలీ ఒక ప్రకటన విడుదల చేయగా.. నేడు మరో ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ఆ చిన్నారికి నామకరణం చేసిన అంబానీ కుటుంబం.. సోషల్ మీడియా వేదికగా ఆ పేరును ప్రపంచానికి చాటి చెప్పింది.

సంయుక్త ప్రకటన విడుదల..

ఆకాశ్ అంబానీ-శ్లోకా దంపతులకు జన్మించిన పండంటి మగబిడ్డకు ‘పృథ్వి ఆకాశ్ అంబానీ’ అని నామకరణం చేశారు. ఆ మేరకు అంబానీ, మెహతా కుటుంబాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారంశం ఏంటంటే..‘కృష్ణ భగవానుడి ఆశీర్వాం.. ధీరూభాయ్ అంబానీ-కోకిలాబెన్ అంబానీ ఆశీర్వాద ఫలంతో మా కుటుంబంలో పండంటి మగ బిడ్డ పుట్టాని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాయి. ఈ చిన్నారికి ‘పథ్వి ఆకాశ్ అంబానీ’ అని పేరు పెట్టాము.’ అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఆ ప్రకటనలో అంబానీ కుటుంబ సభ్యులు, మెహతా కుటుంబ సభ్యులందరి పేర్లనూ పేర్కొంటూ వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు.

‘పృథ్వి’ అని పేరు పెట్టడానికి ఇదే కారణమా? జూనియర్ అంబానీకి ‘పృథ్వి ఆకాశ్ అంబానీ’ అనే పేరు ఎందుకు పెట్టారనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. అంబానీ కుటుంబంలో ఆకాశాన్ని ఉద్దేశించి తన తనయుడికి ముఖేశ్ అంబానీ ‘ఆకాశ్’ పేరు పెట్టగా.. ఇప్పుడు తన మనవడికి భూదేవిని ఉద్దేశించి ‘పృథ్వి ఆకాశ్ అంబానీ’ అనే పేరు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా ఆసియాలో అపర కుభేరుడిగా పేరు గడించిన ముఖేశ్ అంబానీ(63)- నీతా దంపతులకు ఆకాశ్, ఇషా, అనంత్ జన్మించారు. వీరిలో ఆకాశ్, ఇషా కవలలు. ఇక 2018లో ముఖేశ్ అంబానీ-నీతా దంపతుల తనయుడు ఆకాశ్ అంబానీ, రస్సెల్ మెహతా-మోనా దంపతుల కుమార్తె శ్లోకాకు నిశ్చితార్థం అవగా.. గతేడాది ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా వివాహం జరిగింది. ఆకాశ్-శ్లోకా ఇద్దరూ స్కూల్ డేస్ నుంచే మంచి స్నేహితులు.