యడియూరప్పకు బీజేపీ షాక్ ఇవ్వనుందా?.. ముఖ్యమంత్రి పీఠం నుంచి మరోసారి ఔటా?.. కర్ణాటకలో ఏం జరుగుతోంది..?
అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయిన కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు బీజేపీ అధిష్టానం షాక్ ఇవ్వనుందా? ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించనుందా?
అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయిన కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు బీజేపీ అధిష్టానం షాక్ ఇవ్వనుందా? ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించనుందా? కొత్త సీఎం కోసం బీజేపీ అధిష్టానం అన్వేషణ మొదలు పెట్టిందా? వంటి ప్రశ్నలకు బీజేపీ ఢిల్లీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అవినీతి కేసుల నేపథ్యంలో యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి.. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని కేంద్రంలోని పెద్దలు భావిస్తున్నట్లు కమలం పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏం జరిగిందంటే.. కర్ణాటక రాష్ట్రంలో ఐటీ పార్కుల కోసం కేటాయించిన నాలుగు ఎకరాలకు పైగా భూమిని డీనోటిఫై చేసింది. ఆ భూములను గృహ నిర్మాణ అవసరాలకు మళ్లించింది. అయితే ఇలా భూమిని డీనోటిఫై చేసిన భారీ అక్రమాలకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దాంతో దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ 2013లో లోకాయక్త ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ అవినీతి మరకు యడియూరప్పకు అంటుతాయని భావిస్తున్న కేంద్ర పెద్దలు ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా కొత్త సీఎం కోసం అన్వేషణ మొదలు పెట్టారట. అయితే ఈ విషయాన్ని గ్రహించిన యడియూరప్ప.. ఫిబ్రవరి వరకు తనకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దలను వేడుకున్నారట. కానీ, యడియూరప్ప మొరను కేంద్రంలోని పెద్దలు చెవిన పెట్టలేదని సమాచారం.
తదుపరి ముఖ్యమంత్రి ఎవరు..? ఇదిలాఉండగా, యడియూరప్పను ముఖ్యమంత్రిగా తొలగిస్తే.. కర్ణాటకకు తదుపరి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయితే, యడియూరప్ప స్థానంలో లింగాయత్ నేత లక్ష్మణ్ సావడి ప్రముఖంగా వినిపిస్తుండగా, ఆ రేసులో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి యడియూరప్పకు ఉద్వాసన నిజమేనా అని తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
Also read:
Driverless Train: దేశంలోనే తొలిసారి డ్రైవర్ లేకుండానే నడిచే ట్రైన్ వచ్చేస్తోంది..
Gangrape: ఇంతకంటే దారుణం ఉండదేమో.. రక్షక భటుడే భక్షకుడయ్యాడు.. కాపాడయ్యా అంటే కాటేశాడు..