పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు.. అధికారికంగా ఆమోదించిన హైకమాండ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పలు పార్టీలు ఇప్పటి నుంచే...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పలు పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆ పార్టీ బెంగాల్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఈ మేరకు గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఎన్నికల కూటమిగా ఏర్పడేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ఆమోదించింది అని తెలిపారు.
లౌకిక పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ కోసం సీపీఎం సెంట్రల్ కమిటీ అక్టోబర్ నెలలోనే అంగీకారం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి స్థానాలను కేటాయించుకుని పోటీ చేయనున్నాయి.
మరో వైపు బీజేపీ కూడా ఆ రాష్ట్ర అధికారాన్ని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అందు కోసం కేంద్ర హోంశాఖ మంత్రి మంత్రులకు, ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పశ్చిమబెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అలాగే అమిత్ షా కూడా నెలలో ఏడు రోజుల పాటు బెంగాల్‌లో మకాం వేయనున్నారు. ఇలా ఎవరికి వారు ఇప్పటి నుంచి బెంగాల్ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
Today the Congress High command has formally approved the electoral alliance with the #Left parties in the impending election of West Bengal.@INCIndia@INCWestBengal
— Adhir Chowdhury (@adhirrcinc) December 24, 2020