తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండువగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు..
తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాన్ని..
Vaikunta Ekadasi 2020: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. భక్తుల తాడికితో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంమైన తిరుమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. దీంతో వేకువ జామున 3.30 గంటల నుంచే స్వామి వారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. సుమారు రెండున్నర వేల మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనానికి హాజరైనట్లు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం 4 గంటల నుంచి భక్తులకు అనుమతి ఇచ్చారు.
ఇక నేటి నుంచి జనవరి 3 వరకు తిరుమలలో భక్తులకు శ్రీవారి ఉత్తర దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఇప్పటికే భక్తులకు టోకెన్లు జారీ చేశారు. కాగా, 10 రోజుల పాటు స్వామివారి వైకుంఠ దర్శనం కల్పించడం ఇదే తొలిసారి. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో తిరుమలలోని నాలుగు మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు.
Also read:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి డేట్ ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే..