మోసం చేస్తూ దొరికిన డెలివరీ బాయ్.. అరెస్ట్‌

మోసం చేసే ప్రయత్నంలో అమెజాన్‌లో పనిచేసే ఓ డెలివరీ బాయ్‌ దొరికిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఆన్‌లైన్‌లో మొబైల్‌ ఫోన్ బుక్

  • Tv9 Telugu
  • Publish Date - 10:43 am, Wed, 21 October 20
మోసం చేస్తూ దొరికిన డెలివరీ బాయ్.. అరెస్ట్‌

Delivery boy arrested: మోసం చేసే ప్రయత్నంలో అమెజాన్‌లో పనిచేసే ఓ డెలివరీ బాయ్‌ దొరికిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఆన్‌లైన్‌లో మొబైల్‌ ఫోన్ బుక్ చేసుకున్న ఓ వినియోగదారుడిని డెలివరీ బాయ్‌ మోసం చేశాడు. ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందని, రిఫండ్ వస్తుందని ఆ వినియోగదారుడికి డెలివరీ బాయ్ చెప్పాడు. అయితే ఖాతాలో చూస్తే సెల్‌ఫోన్ డెలివరీ అయినట్లుగా చూపించడంతో వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేసి సెల్‌ ఫోన్ రికవరీ చేసుకున్నారు.

Read More:

Corona Updates: దేశంలో కొత్తగా 54,044 పాటిజివ్‌ కేసులు

అవును మా నాన్న డిఫెన్స్‌లో పనిచేశారు.. కానీ: రూమర్లపై నోయల్‌ సోదరుడు