Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో గల్లంతైన భక్తుల కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయ్. ఇద్దరు ఏపీ వాసులు మృత్యువాత పడటంతో మిగతా భక్తుల కోసం చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అమర్‌నాథ్ యాత్రలో గల్లంతైన భక్తులపై గందరగోళం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన యాత్రికుల్లో ఎంతోమంది ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో ఆయా కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇద్దరు ఏపీ వాసులు మృత్యువాత పడటంతో తమవాళ్లు ఎక్కడున్నారో? ఎలా ఉన్నారోనన్న టెన్షన్ పెరిగిపోతోంది. ఏపీ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినవారిలో చాలామంది సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే, ఎవరైతే ఇంకా చేరుకోలేదో వాళ్లందరి వివరాలు సేకరించి, సేఫ్‌గా తీసుకొచ్చే చర్యలు చేపడుతున్నారు. యాత్రకు వెళ్లేముందు భక్తులు ఇచ్చిన చిరునామాలు, ఫోన్ నెంబర్ల ఆధారంగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు అమర్‌నాథ్ యాత్రికుల కోసం స్టేట్‌వైడ్‌గా కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. 1902 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటుచేసి వర్క్ చేస్తున్నారు. అయితే, నెల్లూరు నుంచి వెళ్లిన యాత్రికుల్లో 21మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో వాళ్ల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామంటున్నారు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు. ఇక అమర్‌నాథ్ టూర్‌లో ఇద్దరు మహిళలు మరణించారు. ఇద్దరినీ రాజమండ్రి వాసులుగా గుర్తించారు అధికారులు. మృతుల్లో ఒకరైన సుధ తలకు రాయి తగలడంతో మరణించింది. మరో మహిళను పార్వతిగా గుర్తించారు. మృతులిద్దరినీ ఐడెంటిఫై చేశారు కుటుంబసభ్యులు. ఒకవైపు వరద బీభత్సం కొనసాగుతున్నప్పటికీ, అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. పహల్గాం ప్రాంతం నుంచి టూర్ కొనసాగుతోంది. రెండు మార్గాల్లో హెలికాప్టర్స్ ద్వారా ఆపరేషన్స్ నిర్వహిస్తూ బాల్తాల్ మార్గంలో మరమ్మతు పనులు చేపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి