భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన కాన్పూర్లోని ఆర్టిఫీషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ALIMCO).. ఒప్పంద ప్రాతిపదికన 103 ప్రోస్టెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్, ఆడియాలజిస్ట్, క్లినికల్ ఫిజికాలజిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఐసీడబ్ల్యూఏ/ సీఏ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఎంబీబీఎస్/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 34 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 15, 2023వ తేదీలోపు కింది అడ్రస్కు సంబంధించ డాక్యుమెంట్లను పోస్టు ద్వారా పంపించాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Manager (Administration), Artificial Limbs Manufacturing Corporation of India, G.T. Road, Kanpur – 209217 (U.P).
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.