Anil K Antony: కాంగ్రెస్ పార్టీకి ఏకే ఆంటోనీ తనయుడు గుడ్‌బై.. సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల ట్వీట్స్

|

Jan 25, 2023 | 1:02 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కాంగ్రెస్ ప్రదర్శించడంపై అనిల్ అసహనం వ్యక్తంచేశారు.

Anil K Antony: కాంగ్రెస్ పార్టీకి ఏకే ఆంటోనీ తనయుడు గుడ్‌బై.. సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల ట్వీట్స్
Anil K Antony
Follow us on

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కాంగ్రెస్ ప్రదర్శించడంపై అనిల్ అసహనం వ్యక్తంచేశారు. ప్రధాని మోడీపై విద్వేష ప్రచారం తగదంటూ సొంతపార్టీనే విబేధించిన అనిల్ కే ఆంటోని.. బుధవారం పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2002 గుజరాత్ అల్లర్లపై ప్రధాని మోడీపై రూపొందించిన డాక్యుమెంటరీని ఇటీవల కాంగ్రెసట్ ట్వీట్ చేసింది. ఇది కాస్త వివాదానికి కారణమైంది. ప్రధాని మోదీని విమర్శించే డాక్యుమెంటరీని ప్రదర్శించడంపై ఆందోళన వ్యక్తంచేసిన అనిల్ కె ఆంటోనీ.. పార్టీ తీరు బాధకలిగించిందని.. వాక్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కాంగ్రెస్.. వారి ట్వీట్‌లను ఉపసంహరించుకోవాలని కోరారు. కానీ దానిని వారు నిరాకరించారని.. ఇది ద్వేషం, దుర్వినియోగం, వంచనకు పరాకాష్ట అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. బీబీసీ డాక్యుమెంటరీ దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడమేనంటూ విమర్శించారు. కాగా.. ఈ డాక్యుమెంటరీని కేరళలో ప్రదర్శిస్తామని ప్రకటించడంతో అనిల్ రెండురోజుల నుంచి పార్టీ తీరుపై మండిపడుతున్నారు. బీబీసీ డాక్యుమెంటరీ దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడమే అంటూ వ్యాఖ్యానించారు.

బీబీసీ డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో అనిల్ కే ఆంటోని రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. అనిల్ కె ఆంటోనీ మంచి నిర్ణయం తీసుకున్నారని.. ప్రధాని మోడీపై ఇలాంటివి తగదంటూ పేర్కొంటున్నారు. విద్వేషం రగిల్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని.. ఇది తగదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

స్పందించిన శశి థరూర్..

కాగా, అనిల్‌ కె ఆంటోని రాజీనామాపై కేరళ కాంగ్రెస్ నేత శశి థరూర్‌ స్పందించారు. గుజరాత్ అల్లర్లపై బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ విషయంలో పార్టీ లైన్‌కు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రభుత్వం ప్రతిచర్యలను చూసి తాను ఆశ్చర్యపోయానని.. నిషేధం ఓవరాక్షన్ అంటూ పేర్కొన్నారు. బీబీసీ, పార్టీ చర్యలకు వ్యతిరేకంగా అనిల్ ఆంటోనీ రాజీనామాపై అనిల్‌తో తాను మాట్లాడలేదని, ఇది అసలు చర్చకే రాలేదన్నారు. దీనిపై ఏకే ఆంటోనీతో మాట్లాడినట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించారు. బీబీసీ డాక్యుమెంటరీ మన దేశ సార్వభౌమాధికారాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.. నిషేధం విధించడమంటే కేంద్రం అతిగా స్పందించడమే.. దీనిపై చర్చ అనవసరం.. మనది బలమైన దేశం. అంటూ వ్యాఖ్యానించారు.

దేశ ప్రయోజనాలే ముఖ్యం.. బీజేపీ నేత పూనావాలా..

కాంగ్రెస్ విధానాల వల్లే అనిల్ ఆంటోనీ కాంగ్రెస్‌ను వీడారని.. ఆయన పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నారని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో అందరూ ఒకేతాటిపై నిలబడాల్సింది పోయి.. విమర్శలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇలాంటి వాటితో నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బతీయలేరంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ తీరుపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారన్నారు.

ఇదిలాఉంటే.. ఏకే ఆంటోని కుమారుడు అనిల్ కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.

ఇదే.. ఇది రాహుల్ గాంధీకి ఉన్న సమస్య.. ఆయన ఎన్నటికీ అధికారాన్ని ఉపయోగించలేరు అంటూ కిషోర్‌ కె స్వామి పేర్కొన్నారు.

అనిల్‌ రాజీనామాపై కాంగ్రెస్‌ శ్రేణులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీలోకి వెళ్లేందుకు కావాలనే కాంగ్రెస్‌ పై బురదజల్లుతున్నారంటూ మండిపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..