Air Chief Marshal: వైమానిక దళాధిపతిగా హైదరాబాదీ.. ఆర్కేఎస్ బదౌరియా నుంచి బాధ్యతలు స్వీకరించిన వివేక్ రామ్ చౌదరి
New air chief marshal Vivek Ram Chaudhari: భారత వైమానిక దళాధిపతిగా వివేక్ రామ్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎయిర్ చీఫ్ మార్షల్‌గా ఉన్న ఆర్‌కే బదౌరియా పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో హైదరాబాద్‌కు చెందిన వివేక్ రామ్ చౌదరిని నియమిచింది కేంద్రం.
New air chief marshal Vivek Ram Chaudhari: భారత వైమానిక దళాధిపతిగా వివేక్ రామ్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎయిర్ చీఫ్ మార్షల్‌గా ఉన్న ఆర్‌కే బదౌరియా పదవీ విరమణ చేయడంతో.. ఆయన స్థానంలో హైదరాబాద్‌కు చెందిన వివేక్ రామ్ చౌదరిని నియమిచింది కేంద్ర ప్రభుత్వం. 2024 వరకు మూడేళ్ల పాటు ఎయిర్‌ఫోర్స్ చీఫ్ పదవిలో వివేక్‌రామ్ చౌదరి కొనసాగుతారు.
సీనియారిటీ ప్రాతిపదికన ప్రభుత్వం చౌదరిని ఈ పదవికి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఐఏఎఫ్ చీఫ్‌గా కొనసాగుతున్న రాకేశ్‌కుమార్ సింగ్ భదౌరియా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం(సెప్టెంబర్ 21) కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగష్టు 1, 2020 నుండి పశ్చిమ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. సున్నితమైన లడఖ్ సెక్టార్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో భారత వైమానిక అంతరిక్ష భద్రతకు సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహించారు.
Air Chief Mshl VR Chaudhari took over command of the #IndianAirForce as its 27th Chief from Air Chief Mshl RKS Bhadauria on 30 Sep. Air Chief Mshl Chaudhari, commissioned in Dec 82 in the fighter stream of #IAF, was the #VCAS prior to taking over as #CAS pic.twitter.com/QVnreNgQ8L
— Indian Air Force (@IAF_MCC) September 30, 2021
కాగా, భారత వైమానిక దళానికి తదుపరి వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ కొనసాగనున్నారు. అతనితో పాటు, వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్ ఎయిర్ మార్షల్ బిఆర్ కృష్ణ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. వైస్ అడ్మిరల్ అతుల్ జైన్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ప్రస్తుతం వీఆర్ చౌదరి డిప్యూటీ ఎయిర్ చీఫ్ స్టాఫ్‌గా కొనసాగుతున్నారు. డిసెంబర్ 29, 1982న ఆయన ఐఏఎఫ్‌లో చేరారు. దాదాపు 39 సంవత్సరాల కెరీర్‌లో భారత వైమానిక దళానికి చెందిన వివిధ రకాల ఫైటర్, ట్రైనర్ విమానాలను నడిపారు. మిగ్ -21, మిగ్ -23 ఎంఎఫ్, మిగ్ -29, సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లలో సుమారు 3,800 గంటల పాటు ప్రయాణించిన అనుభవం ఆయనకు ఉంది.
Bank Account Safety: సైబర్ నేరగాళ్ళ నుంచి మీ బ్యాంక్ ఎకౌంట్‌ను ఇలా రక్షించుకోండి!