
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరాయి. నేపథ్యంలో పాక్ వ్యతిరేకంగా భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. సిందూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, భారత్‌లో ఉన్న పాకిస్థాన్ దేశస్తులను దేశం నుంచి పాకిస్తాన్ తిరిగి వెళ్లిపోమనడం వంటి నిర్ణయాలతో పాటు, భారత్-పాక్ మధ్య ఉన్న దౌత్య ఒప్పందాలను కూడా రద్దు చేసింది. దీంతో భారత ప్రభుత్వంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించకుడా నిషేదాన్ని విధించింది. దీంతో భారత్ నుంచి పలు దేశాలకు వెళ్లే విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకుంటున్నాయి.
పాక్ గగనతలం మూసివేయడంతో భారత్ నుంచి పలు దేశాలకు వెళ్లే విమానాలు ఇప్పుడు అరేబియా సముద్రం మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. దీంతో విమానాలు ఎక్కువ గంటలు ప్రయాణించాల్సి రావడంతో పాటు, ఇంధన ఖర్చులు, ఉద్యోగుల పనిగంటలు కూడా పెరిగిపోతున్నాయి. విమాన సంస్థలకు నిర్వహణ ఖర్చు కూడా పెరిగిపోతుంది. అయితే విదేశాలకు అప్పుడప్పుడు వెళ్లే విమాలకు ఇది పెద్ద సమస్య కాకపోయినా… తరచూ రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా వంటి పెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఇది చాలా ఇబ్బంది కరంగా మారింది.
భారత్ నుంచి ఉత్తర అమెరికాకు డైరెక్ట్ విమానాలను కలిగి ఉన్న ఏకైక భారతీయ క్యారియర్ సంస్థ ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా భారత్ నుంచి అమెరికాలోని వివిద ప్రాంతాలకు సుమారు 77 సర్వీస్‌లను నడుపుతోంది. ఇందులో దాదాపు 54 సర్వీసులు భారత రాజధాని ఢిల్లీ నుంచే ఉన్నాయి. అయితే అరేబియా సముంద్రం మీదుగా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానాలు ఇంధనాన్ని ఫిల్ చేసుకోవడానికి ఐరోపాలోని ఆస్ట్రియా, కోపెన్ హాగెన్ (డెన్మార్క్) నగరాలను టెక్నికల్ స్టాఫ్‌గా ఎంచుకుంటున్నాయి. అయితే అక్కడ ల్యాండింగ్ చార్జీలతో పాటు ఇంధనం ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. వీటితో పాటు నెట్‌వర్క్ సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే విమానాల కోసం భారత్‌లోనే ఓ ప్రత్యేక టెక్నికల్ స్టాప్‌ను ఏర్పాటు చేసే యోచనతో ఎయిర్ ఇండియా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందు కోసం ముంబయి లేదా అహ్మదాబాద్‌లలో ప్రత్యేక టెక్నికల్ స్టాప్‌లను ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఎయిర్ ఇండియా MD, CEO కాంప్‌బెల్ విల్సన్ తెలియజేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..