Air Force Officer Afshan Tearful Farewell Video: పైలట్‌ నమాన్ష్‌కు భార్య కన్నీటి సెల్యూట్‌.. ముగిసిన అంత్యక్రియలు! వీడియో వైరల్

Wing Commander Afshan's Tearful Farewell To Husband Namansh: దుబాయ్ ఎయిర్ షోలో భారత స్వదేశీ యుద్ధవిమానం తేజస్ ఫైటర్ జెట్ శుక్రవారం (నవంబర్‌ 21) కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భారత్‌ పైలట్‌ ప్రాణాలు కోల్పోవడం దేశ రక్షణ విభాగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పైలట్ మృతదేహాన్ని ఈరోజు..

Air Force Officer Afshan Tearful Farewell Video: పైలట్‌ నమాన్ష్‌కు భార్య కన్నీటి సెల్యూట్‌.. ముగిసిన అంత్యక్రియలు! వీడియో వైరల్
Wing Commander Afshan's Tearful Farewell

Updated on: Nov 23, 2025 | 6:41 PM

దుబాయ్ ఎయిర్ షోలో భారత స్వదేశీ యుద్ధవిమానం తేజస్ ఫైటర్ జెట్ శుక్రవారం (నవంబర్‌ 21) కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భారత్‌ పైలట్‌ ప్రాణాలు కోల్పోవడం దేశ రక్షణ విభాగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పైలట్ మృతదేహాన్ని ఈరోజు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలోని స్వగ్రామం పాటియాల్కర్‌కు తీసుకువచ్చారు. పైలట్‌ వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్‌కు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భార్య వింగ్ కమాండర్ అఫ్షాన్ తుది నివాళులర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించారు.

పైలట్‌ నమాన్ష్ సయాల్‌కు భార్య, ఐదేళ్ల కుమార్తె నమాన్ష్ ఉన్నారు. భార్య అఫ్షాన్ కూడా ఎయిర్‌ ఫోర్స్‌ ఫైలట్‌ కావడం విశేషం. ఆమె తన భర్తకు సెల్యూట్ చేస్తున్నప్పుడు కన్నీళ్లతో తల్లడిల్లిపోతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సెల్యూట్‌ అనంతరం తోటి మహిళా అధికారి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లడం వీడియోలో చూడొచ్చు. అంకితభావం కలిగిన యుద్ధ పైలట్, వింగ్ కమాండర్ సియాల్ అచంచలమైన నిబద్ధత, అసాధారణ నైపుణ్యం, అలుపెరుగని కర్తవ్య భావనతో దేశానికి సేవ చేశారని వైమానిక దళం (ఐఏఎఫ్‌) సోషల్ మీడియా ఖాతాలో నివాళులు అర్పించింది. యూఏఈ అధికారులు, స్నేహితులు, భారత రాయబార కార్యాలయ అధికారులు వీడ్కోలు ఈ అంతిమ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమాన్ష్ సయాల్‌ను చివరిసారిగా చూసేందుకు గ్రామస్థులు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు పైలట్‌ నమాన్ష్ మృతికి విచారం వ్యక్తం చేశారు. భారత్‌ తన ధైర్యవంతుడైన పుత్రుడిని చాలా త్వరగా తీసుకుంది అని ట్వీట్‌ చేశారు. వింగ్ కమాండర్ సియాల్ చదువుకున్న పాఠశాలలోనే చదువుకున్న క్లాస్‌ మెట్‌ పంకజ్ చద్దా మాట్లాడుతూ..నేను కూడా నమాన్ష్ చదివుకున్న సుజన్‌పూర్ తీరా సైనిక్ స్కూల్‌లోనే చదువుకున్నాను. మన జమ్స్‌లో ఒకరిని కోల్పోయాం. మన స్కూల్‌కి ఆయన ఎంతో గర్వకారణమని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us