Subrata Mukherjee: మంత్రి సుబ్రతా ముఖర్జీ ఇక లేరు.. అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత

|

Nov 05, 2021 | 1:32 AM

Subrata Mukherjee: అనారోగ్యం కారణంగా ఓ మంత్రి కన్నుమూశారు. రాజకీయంలో సీనియర్‌ నేతగా ఉన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు..

Subrata Mukherjee: మంత్రి సుబ్రతా ముఖర్జీ ఇక లేరు.. అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత
Subrata Mukherjee
Follow us on

Subrata Mukherjee: అనారోగ్యం కారణంగా ఓ మంత్రి కన్నుమూశారు. రాజకీయంలో సీనియర్‌ నేతగా, మంత్రిగా ఉన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ (75) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. అయితే వారం రోజుల కిందట శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన మరణ వార్తను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే ఆస్పత్రికి వెళ్లారు.

సుబ్రతా మృతి పట్ల మమతా తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. సుబ్రతా మరణం వల్ల తనకు వ్యక్తిగతంగా ఎంతో నష్టమని, ఆయన లోటు తీరనిదని అన్నారు. కాగా, మమతా మంత్రివర్గంలో కీలక మంత్రిగా పని చేసిన ఆయన పంచాయతీరాజ్‌ శాఖతో సహా పలు ఇతర శాఖల బాధ్యతలు కూడా చేపట్టారు. ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టి మంత్రి వరకు ఎదిగారు. 26 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే సిద్ధార్థ శంకర్‌ రే నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రులలో సుబ్రతా ముఖర్జీ ఒకరు.

ఆయన 2000 నుంచి 2005 వరకు కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మేయర్‌గా కూడా పని చేశారు. 1999 వరకు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. ప్రియా రంజన్‌ దాస్కున్షి, సోమేంద్రనాథ్‌ మిత్ర వంటి ప్రముఖ నాయకులలో ఆయన ఒకరు.1999లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరి, 2005 వరకు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2011లో మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐదు దశాబ్దాల పాటు సాగిన తన రాజకీయ జీవితంలో కోల్‌కతాలోని బల్లిగంజ్‌, చౌరింగీతో సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో బల్లిగంజ్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇవి కూడా చదవండి:

Lalu Prasad Yadav: అదంతా ఎన్నికల డ్రమానే.. రూ.50 తగ్గిస్తే ప్రజలకు అసలైన మేలు: ఆర్జేడీ అధినేత లాలూ

Hooch Tragedy: పండుగ పూట విషాదం.. కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది మృత్యువాత..