AIADMK case: ఓపిఎస్, ఈపీఎస్ మధ్య ఐదేళ్లుగా పోరు.. చివరికి నెగ్గింది ఎవరంటే..?

| Edited By: Balaraju Goud

Nov 09, 2023 | 6:54 AM

తమిళనాట ఏళ్ల తరబడి అత్యంత వివాదాస్పదంగా మారిన ఏఐఏడీఎంకే చీఫ్ వివాదంపై కోర్టు తీర్పు వెలువడింది. ఏఐఏడీఎంకే పార్టీకి చీఫ్ నేనంటే నేనే అంటూ రెండు వర్గాలుగా విడిపోయిన మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్ సెల్వం(ఓపిఎస్), ఈ పలని స్వామి(ఈపిఎస్) చివరకు కోర్టు దాకా వెళ్లారు. సుదీర్ఘ వాదనల అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది.

AIADMK case:  ఓపిఎస్, ఈపీఎస్ మధ్య ఐదేళ్లుగా పోరు.. చివరికి నెగ్గింది ఎవరంటే..?
Panneerselvam, Palaniswami
Follow us on

తమిళనాట ఏళ్ల తరబడి అత్యంత వివాదాస్పదంగా మారిన ఏఐఏడీఎంకే చీఫ్ వివాదంపై కోర్టు తీర్పు వెలువడింది. ఏఐఏడీఎంకే పార్టీకి చీఫ్ నేనంటే నేనే అంటూ రెండు వర్గాలుగా విడిపోయిన మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్ సెల్వం(ఓపిఎస్), ఈ పలని స్వామి(ఈపిఎస్) చివరకు కోర్టు దాకా వెళ్లారు. సుదీర్ఘ వాదనల అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. పార్టీ చీఫ్ గా అర్హత ఎవరిదో తేల్చిచెప్పింది.

రెండాకుల పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. జయలలిత మరణాంతర పరిణామాలతో పార్టీలో అనేక మలుపులు తిరిగాయి. మాజీ ముఖ్యమంత్రులు ఈపీఎస్, ఓపిఎస్‌లు సంయుక్తంగా పార్టీ బాధ్యతలు చెప్పట్టారు. ఏక నాయకత్వం కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేశారు. వర్గపోరులో బలాబలాల ప్రదర్శనలో పార్టీకి ఎవరు అర్హులు అన్నది తేలలేదు. దీంతో విషయం కోర్టు దాకా వెళ్ళింది..

ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న దివంగత జయలలిత మరణాంతర పరిణామాలు అనేక మలుపులు తిరిగాయి. అమ్మ తర్వాత చిన్నమ్మగా పిలవబడే శశికళ అన్నీ తానే అయి నడిపించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కోర్టు తీర్పు పర్యవసానం చిన్నమ్మ జైలుకెళ్లాక పలని స్వామి శశికళకు ఎదురు తిరిగారు. అంతా బాగుంది అనుకుంటుండగా 2017 లో మాజీ సీఎం పన్నీర్ సెల్వం పార్టీలో చీలిక ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో కొంతకాలంగా వివాదం తర్వాత ఓపిఎస్, ఈపీఎస్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. పార్టీ బాధ్యతలు ఇద్దరూ కలిసి నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల పార్టీలోకి శశికళను రప్పించాలని ఓపిఎస్ తెరవెనుక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. తాజాగా పార్టీ లో ఏక నాయకత్వం రావాలని అది నేనే కావాలని ఓపిఎస్ ప్రయత్నాలు చేశారు. అంతే ధీటుగా ఈపీఎస్ కూడా తన వ్యూహాలకు పదును పెట్టారు. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఏఐఏడీఎంకే పార్టీలో అధ్యక్ష పదవి కంటే ప్రధాన కార్యదర్శి పదవి కీలకం. ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నిక కోసం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈపిఎస్ ను మెజారిటీ సభ్యులు ఎన్నుకున్నారు. అయితే ఆ సమావేశానికి వచ్చిన ఓపిఎస్ తన వర్గం నేతలను సమావేశానికి రాకుండా చేశారానే ఆరోపణలతో కోర్టును ఆశ్రయించారు. దీంతో మూడేళ్ళ తర్వాత మద్రాస్ హైకోర్టులో తీర్పు వెలువడింది. పార్టీ బైలా.. సభ్యుల తీర్మానం వంటి అంశాలను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఈపిఎస్ నియామకం చెల్లుతుందని తీర్పు ఇచ్చింది. దీంతో ఈపిఎస్ వర్గంలో సంబరాలు జరుగితుండగా.. ఓపిఎస్ వర్గంలో అసంతృప్తి నెలకొంది. తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఓపిఎస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…