
గురువారం గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా AI 171 మిమానం రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజె మెడికల్ కాలేజ్ బిడ్జింగ్‌ను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా 241 మంది మరణించారని అహ్మదాబాద్ సీపీ తెలిపారు. విమానం కాలేజ్ బిడ్జింగ్‌ను ఢీకొట్టడంతో బిడ్జింగ్‌లోని మెడికల్ విద్యార్థులు కూడా చనిపోయినట్టు ఆయన తెలిపారు.అయితే, ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.
కాగా ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 274 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో 241 మంది విమాన ప్రయాణికులు ఉండగా,33 మంది బిజె మెడికల్ కళాశాలకు చెందిన వారు ఉన్నట్టు సమాచారం. అయితే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గాయపడిన వారు ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. దీంతో మృతదేహాలను గుర్తించేందుకు వైద్యులు డీఎన్‌ఏ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.ఈ డీఎన్ఏ టెస్టు ఫలితాల ఆధారంగా విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల మృతుదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు అధికారులు.
కాగా అహ్మదాబాద్‌లోని విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఘటనా స్థలానికి పరిశీలించిన తర్వాత విమాన ప్రమాదంలో గాయపడి సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..