Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Airport: కేంద్ర కీలక నిర్ణయం.. ఢిల్లీలో వారం రోజుల పాటు విమాన రాకపోకలు బంద్..

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు రెండు గంటల పాటు విమాన సేవలు నిలిచిపోనున్నాయి. నోటీస్ టు ఎయిర్‌మెన్ ప్రకారం, జనవరి 19 నుండి 26వ తేదీ మధ్య 2 గంటల 15 నిమిషాల పాటు ఢిల్లీ విమానాశ్రయం నుండి ఇక్కడ ఏ ఫ్లైట్ టేకాఫ్ లేదా ల్యాండ్ అవ్వదు.

Delhi Airport: కేంద్ర కీలక నిర్ణయం.. ఢిల్లీలో వారం రోజుల పాటు విమాన రాకపోకలు బంద్..
Flight
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 19, 2024 | 4:45 PM

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో విమాన రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆంక్షలు విధించింది. తక్షణమే అమల్లోకి వచ్చే ఈ ఆంక్షలు జనవరి 26 వరకూ ఉంటాయని కేంద్ర సర్కార్ తెలిపింది. ఉదయం 10.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ ఎటువంటి విమానాలను అనుమతించబోమని తెలిపింది. రిపబ్లిక్ డే వేడుకలను దృష్టిలో ఉంచుకుని భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ మేరకు ఢిల్లీ విమానాశ్రయం మైక్రో బ్లాగింగ్ సైట్ X (ఇంతకుముందు ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేసింది. నోటీస్ టు ఎయిర్‌మెన్ ప్రకారం, జనవరి 19 నుండి 26వ తేదీ మధ్య 2 గంటల 15 నిమిషాల పాటు ఢిల్లీ విమానాశ్రయం నుండి ఇక్కడ ఏ ఫ్లైట్ టేకాఫ్ లేదా ల్యాండ్ అవ్వదు అంటూ రాసుకొచ్చారు.

దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు రెండు గంటల పాటు విమాన సేవలు నిలిచిపోనున్నాయి. ఇది ఆర్థికంగా నష్టం కలిగించినప్పటికీ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, బీఎస్ఎఫ్ వంటి భద్రతా బలగాల హెలికాప్టర్లు, విమానాలు లేదా గవర్నర్లు, ముఖ్యమంత్రులు ప్రయాణించే విమానాలకు మాత్రం ఎటువంటి ఆటంకం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక, గత కొద్ది వారాలుగా పొగమంచు కారణంగా ఢిల్లీలో వందల విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్నింటిని దారిమళ్లించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
విజయాల లక్నో, పరాజయాల చెన్నై.. గెలుపు ఎవరిదో తెలుసుగా మచ్చా?
విజయాల లక్నో, పరాజయాల చెన్నై.. గెలుపు ఎవరిదో తెలుసుగా మచ్చా?
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా