సంచలన నిర్ణయం తీసుకున్న వీహెచ్‌పీ.. ఏంటో తెలుసా..?

మరో వారం రోజుల్లోగా అయోధ్య వివాదంపై.. సుప్రీంకోర్టు తీర్పు వస్తున్న తరుణంలో విశ్వ హిందూ పరిషత్ సంచలన నిర్ణయం తీసుకుంది. రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. 1990 నుంచి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో ప్రతిగ్రామం నుంచి ఇటుకలను సమీకరించింది. అంతేకాదు.. ఆ తర్వాత మందిర నిర్మాణం కోసం.. శిలలను చెక్కించడం ప్రారంభించింది. దాదాపు ముప్పై ఏళ్లుగా.. ప్రతి రోజు ఈ శిలలను చెక్కడం నిత్య కృత్యంగా కొనసాగుతోంది. అయితే తాజాగా […]

సంచలన నిర్ణయం తీసుకున్న వీహెచ్‌పీ.. ఏంటో తెలుసా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 08, 2019 | 3:38 PM

మరో వారం రోజుల్లోగా అయోధ్య వివాదంపై.. సుప్రీంకోర్టు తీర్పు వస్తున్న తరుణంలో విశ్వ హిందూ పరిషత్ సంచలన నిర్ణయం తీసుకుంది. రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. 1990 నుంచి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో ప్రతిగ్రామం నుంచి ఇటుకలను సమీకరించింది. అంతేకాదు.. ఆ తర్వాత మందిర నిర్మాణం కోసం.. శిలలను చెక్కించడం ప్రారంభించింది. దాదాపు ముప్పై ఏళ్లుగా.. ప్రతి రోజు ఈ శిలలను చెక్కడం నిత్య కృత్యంగా కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ శిలలను చెక్కించే పనికి విరామం ఇచ్చింది. మరో వారం రోజుల్లో తీర్పు రానున్న నేపథ్యంలో.. ప్రభుత్వం సూచనల మేరకు.. అన్ని పనులను నిలిపివేసినట్టు వీహెచ్‌పీ వెల్లడించింది.

సంస్థ ఉన్నతాధికారుల తదుపరి ఆదేశాలు ఇచ్చిన తర్వాత.. తిరిగి మందిర నిర్మాణ పనులు చేపడతామని సంస్థ ప్రతినిధి శరద్ శర్మ పేర్కొన్నారు. 1990 నుంచి వీహెచ్‌పీ ‘నిర్మాణ కార్యశాల’ పేరుతో శిల్పాలు సిద్ధం చేస్తోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 1.25 లక్షల క్యూబిక్ అడుగుల రాళ్లు చెక్కారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏవైనా కూడా.. ప్రతిరోజు శిల్పాలు చెక్కినట్లు తెలిపారు.