ముంపు గ్రామానికి నీటిలో ఈదుతూ… ‘ సెల్ఫీ మంత్రి ‘ ‘డ్యామేజీ కంట్రోల్ ‘ !
మహారాష్ట్రలోని సాంగ్ల్లీ జిల్లాలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు వెళ్లిన మంత్రి గిరీష్ మహాజన్.. అక్కడ సర్వే చేస్తూ ఓ బోటులో చిద్విలాసంగా చేతులూపుతూ.. చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఓవైపు వరదలతో జనం అల్లాడుతుంటే.. ఈయన సెల్ఫీలు దిగుతారా అంటూ నెటిజన్లు దుయ్యబట్టారు. ఓ యూజరైతే.. ‘ వచ్ఛే ఎన్నికల్లో దీని ప్రభావం మీ పార్టీపై తీవ్రంగా పడుతుంది ‘ […]
మహారాష్ట్రలోని సాంగ్ల్లీ జిల్లాలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు వెళ్లిన మంత్రి గిరీష్ మహాజన్.. అక్కడ సర్వే చేస్తూ ఓ బోటులో చిద్విలాసంగా చేతులూపుతూ.. చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఓవైపు వరదలతో జనం అల్లాడుతుంటే.. ఈయన సెల్ఫీలు దిగుతారా అంటూ నెటిజన్లు దుయ్యబట్టారు. ఓ యూజరైతే.. ‘ వచ్ఛే ఎన్నికల్లో దీని ప్రభావం మీ పార్టీపై తీవ్రంగా పడుతుంది ‘ అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరొకరు.. ‘ మంత్రిగారు ఫ్రీ బోట్ రైడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు ‘ అని వ్యంగ్యంగా సెటైర్ వేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ వెంటనే స్పందించింది. వరద నీటి ముంపునకు గురైన ఓ గ్రామానికి గిరీష్ మహాజన్… నీటిలో ఈదుకుంటూ వెళ్లారని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆ పార్టీ ట్వీట్ చేసింది. ‘ సబ్ కా వికాస్ ‘ అన్న ప్రధాని మోదీ నినాదాన్ని కూడా ఈ పార్టీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ వీడియోలో మంత్రి.. వరద నీటి ప్రాంతాన్ని క్రాస్ చేస్తున్న దృశ్యాన్ని రెడ్ సర్కిల్ లో చూపారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి..మంత్రి అయిన గిరీష్ మహాజన్.. మొత్తానికి ‘ డ్యామేజీ కంట్రోల్ ‘ పనిలో పడి.. ట్రోలర్ల నుంచి తలెత్తిన ఆగ్రహాన్నికొంతవరకు చల్లార్చుకోగలిగారు.
Maharashtra Minister Shri @girishdmahajan swims to reach a flood hit village.
This is how BJP earns Sabka Vishwas. #MaharashtraFloods pic.twitter.com/NA31lieLQ5
— BJP (@BJP4India) August 10, 2019