మిజోరంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తుంది. పందుల్లో ఈ వ్యాధి వ్యాప్తి కలకలం రేపుతుంది. మార్చి 21 నుంచి మే 31 మధ్య.. అంటే కేవలం రెండు నెలల 10 రోజుల సమయంలోనే మిజోరంలో 4,832 పందులు స్వైన్ ఫీవర్ బారిన పడి చనిపోయాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ తెలిపింది. మే 31న ఒక్కరోజే 81 పందులు చనిపోయాయని వివరించింది. అధికారులు చెబుతోన్న లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు మిజోరంలోని ఎనిమిది జిల్లాల్లో స్వైన్ ఫీవర్ కేసులు వెలుగుచూశాయి. లంగ్సెన్ జిల్లాలో మార్చి 25న ఫస్ట్ కేసు గుర్తించారు. అనంతరం అన్ని జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ మోహరించారు. లంగ్సెన్ను ఇన్ఫెక్టెడ్ జోన్‌గా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అనౌన్స్ చేసింది. ఆ జిల్లాలోని 26 గ్రామాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో మొత్తం 31,108 పందులు ఉన్నాయని సమాచారం.
ఇన్ఫెక్టెడ్ జోన్ వెలుపల 100 పందులు అనుమానాస్పద రీతిలో మరణించినట్లు తెలిసిందని గవర్నమెంట్ తెలిపింది. పక్క రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పందుల వల్ల స్వైన్ ఫీవర్ వ్యాపించి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అత్యంత ప్రమాదకరమైన డిసీజ్. దీని ద్వారా పందులు అధిక సంఖ్యలో మరణిస్తున్నాయి. ఈ వ్యాధి పందుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.
Also Read: అక్కడ ఉంది జక్కన్న.. తగ్గేదే లే.. ప్రమోషన్‌లో కూడా తన మార్క్