Tours: అంతరించిపోతున్న జంతువుల నిలయం ఆ పర్యాటక ప్రాంతం.. కోవిడ్ తర్వాత మొదలైన సందర్శకుల సందడి.. ఎలిఫెంట్ రైడ్ లపై ఆసక్తి..

అంతరించిపోతున్న ఒక కొమ్ము గల ఖడ్గ మృగాలు దేశంలో ఎక్కడా కన్పించవు. కేవలం అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్ లో మాత్రమే వీటిని చూడగలం. మనందరికి ఎన్నో రైడ్ ల గురించి తెలుసు.. కాని ఎలిఫెంట్ రైడ్ తెలియకపోవచ్చు. ఏనుగు పై కూర్చుని సవారి చేస్తే ఆ అనుభూతే..

Tours: అంతరించిపోతున్న జంతువుల నిలయం ఆ పర్యాటక ప్రాంతం.. కోవిడ్ తర్వాత మొదలైన సందర్శకుల సందడి.. ఎలిఫెంట్ రైడ్ లపై ఆసక్తి..
Kaziranga National Park

Updated on: Nov 04, 2022 | 6:30 PM

అంతరించిపోతున్న ఒక కొమ్ము గల ఖడ్గ మృగాలు దేశంలో ఎక్కడా కన్పించవు. కేవలం అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్ లో మాత్రమే వీటిని చూడగలం. మనందరికి ఎన్నో రైడ్ ల గురించి తెలుసు.. కాని ఎలిఫెంట్ రైడ్ తెలియకపోవచ్చు. ఏనుగు పై కూర్చుని సవారి చేస్తే ఆ అనుభూతే వేరు. ఇలా ఎన్నో రకాల జంతువులకు నిలయంగా ఉన్న కాజీరంగ నేషనల్ పార్కులోకి కోవిడ్ తర్వాత సందర్శకులను అనుమతిస్తున్నారు. దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులతో ఎప్పుడు కళకళలాడే ఈ పార్కు కొంతకాలంగా బోసిపోయింది. కోవిడ్ నిబంధనల సడలింపుతో మరోసారి కాజీరంగా నేషనల్ పార్క్ సందర్శకులతో కళకళలాడుతోంది. అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్ ఎన్నో విశిష్టతలు కలిగి ఉంది. అంతరించిపోతున్న ఒక కొమ్ము గల ఖడ్గమృగాలకు ఈ జంతుప్రదర్శనశాల నిలయంగా ఉంది. ప్రపంచంలోనే పులులు అత్యధిక సంఖ్యలో ఉండటం ఈ పార్కు ప్రత్యేకత. ఈ జాతీయ పార్క్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రక్షింపబడుతోంది. కోవిడ్ మహామ్మారి కారణంగా ఈ పార్కుకు సందర్శకుల అనుమతిని గతంలో నిలిపివేశారు. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి తగ్గడంతో రెండేళ్ల తర్వాత నబంబర్ 2వ తేదీన కాజీరంగా నేషనల్ పార్క్ కు సందర్శకులను అనుమతిస్తున్నారు.

అస్సాం రాష్ట్రంలోని కాజీరంగా నేషనల్ పార్క్ ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచిన పర్యాటక ప్రాంతం. రెండేళ్ల తర్వాత ఈ పార్కు సందర్శనకు అనుమతిస్తుండటంతో దేశీయ, విదేశీ సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. తాజాగా ఆఫ్రికన్ , యూరోపియన్ దేశాలకు చెందిన పర్యాటకులు అస్సాంలోని కాజిరంగా నేషనల్ పార్క్‌లో 18 కార్లు, 2 మోటార్‌బైక్‌లతో వింటేజ్ కార్ ర్యాలీని నిర్వహించారు. పాత కాలానికి చెందిన కార్లలో వీరు ఈ పార్కులో పర్యటించారు. రెండు రాత్రులు ఈ పార్కులో బస చేయనున్నారు. విదేశీ పర్యాటకుల సందర్శనతో సందడి నెలకొంది. ఎలిఫెంట్ రైడ్లు ఈ పార్కు ప్రత్యేకత. కోవిడ్ నిబంధనల సడలింపుతో ఏనుగులపై సవారీని అధికారికంగా నవంబర్ 2వ తేదీన ప్రారంభించారు.

ప్రతిరోజూ ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు, పర్యాటకులు ఏనుగుపై సవారి చేయడానికి అనుమతిస్తారు. బాగ్రీ అటవీ ప్రాంతంలో 25 ఏనుగులు, కోహ్రా జంగిల్‌లో 10 ఏనుగులు అందుబాటులో ఉన్నాయి. ఎలిఫెంట్ రైడ్ కోసం సందర్శకులు భారీగా తరలివస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..