Actor Vijay: అడుగడుగునా ‘వి’ సెంటిమెంట్.. నటుడు విజయ్ విజయ రహస్యం అదేనా?

| Edited By: Balaraju Goud

Oct 26, 2024 | 3:58 PM

విళ్లిపురం వేదికగా జరగనున్న సీని నటులు విజయ్ పార్టీ మహానాడుకు భారీగా జన సమీకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు ఇక్కడ జరిగే బహిరంగ సభలో 'వి' సెంటిమెంట్ ప్రతి అంశం లోను కనబడుతుండడం ప్రత్యేకత.

Actor Vijay: అడుగడుగునా వి సెంటిమెంట్.. నటుడు విజయ్ విజయ రహస్యం అదేనా?
Thalapathy Vijay
Follow us on

తమిళనాట మరో రాజకీయ పార్టీ చిరుగిస్తోంది. ఇప్పటికే పార్టీ పేరు, జెండా ప్రకటించిన నటుడు విజయ్.. మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమిళనాడులోని విల్లుపురం వేదికగా మహానాడు జరుగుతుండగా లక్షల్లో అభిమానులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. సభ నిర్వహణ ‘వి’ సెంటిమెంట్‌తో జరుపుతున్నారు. తమిళనాట రాజకీయాలను సినీ పరిశ్రమను వేరు చేసి చూడలేం..! తాజాగా విజయ్ రాజకీయ అంరంగేట్రం ఇపుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

దేశంలో సినీ పరిశ్రమ నుంచి వచ్చి రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసిన పరిస్థితి దక్షిణ భారత దేశంలోనే ఎక్కువగా చూస్తుంటాం. అందులోనూ తమిళనాడులో కాస్త ఎక్కువ ఈ వాతావరణం మనకు కనబడుతుంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, విజయ్ కాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలను ఏర్పాటు చేశారు. ఇటీవలే తమిళ నటుడు విజయ్ కూడా ఇటీవల రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఒక అడుగు ముందుకేసి, పార్టీ పేరు, పార్టీ థీమ్ వీడియో కూడా విడుదల చేశారు. విజయ్ విడుదల చేసిన పార్టీ థీమ్ వీడియోలో ఉన్న అంశాలు కూడా తమిళనాడు తీవ్ర చర్చకు దారితీసాయి.

విజయ్ రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రిక్ కలగం కాగా.. పార్టీ జెండాలో జంట ఏనుగులు ఉండేలా రూపొందించారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందే విజయ్ తన పార్టీని ప్రకటించినా.. తమ టార్గెట్ 2026 అసెంబ్లీ ఎన్నికలేనని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని అప్పుడే ప్రకటించారు. మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటి నుంచి పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు అందులో భాగంగానే ఆదివారం(అక్టోబర్ 27) పార్టీ మహానాడు పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు నిర్ణయించారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

విళ్లిపురం వేదికగా జరగనున్న మహానాడుకు భారీగా జన సమీకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు ఇక్కడ జరిగే బహిరంగ సభలో ‘వి’ సెంటిమెంట్ ప్రతి అంశం లోను కనబడుతుండడం ప్రత్యేకత. ఆ.. వి సెంటిమెంట్ ఏంటంటే. పార్టీ వ్యవస్థాపకుడు నటుడు పేరు విజయ్.. పార్టీ పేరులో ఉన్న వెట్రిక్ అనేది వి తో మొదలవుతుంది. మహానాడు సభ నిర్వహించేది విళ్లిపురం జిల్లా కేంద్రం.. అది కూడా వి అక్షరంతో మొదలవుతుంది. విళ్లిపురం జిల్లాలోని విక్రవాండి ప్రాంతంలో సభ ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఇది కూడా వి అనే అక్షరం తోనే మొదలవుతుంది. విక్రవాండిలో సభ జరిగే ల్యాండ్ మార్క్ వి జంక్షన్ కావడం మరో విశేషం..! ఇన్ని వి అనే అక్షరాల ప్రత్యేకతలు విజయ్ రాజకీయ పార్టీ సభలో ఉండడం ఇప్పుడు ఇది హాట్‌టాపిక్‌గా మారింది.

ఇన్ని ‘V’ లు సెంటిమెంట్ గా కలిసి మీతో మొదలయ్యే విక్టరీ అందుకోవాలని లక్ష్యంగానే ఈ విధంగా మహానాడును రూపొందించినట్లు విజయ్ అభిమానులు చెబుతున్నారు. సభకు 5 లక్షలకు తక్కువ కాకుండా వచ్చేలా ఏర్పాటులు చేపట్టారు 50 వేల మందికి సీటింగ్ సదుపాయం కూడా కల్పించారు. సభా ప్రాంగణం మొత్తం తమిళ సెంటిమెంట్ తమిళ రాజకీయ ఉద్దండులు, ద్రవిడ వాద పితామహులు అందరి ప్రస్తావన ఉండేలా ఏర్పాట్లు చేపట్టారు. మహానాడు వేదికగా విజయ్ పార్టీ ఏర్పాటుకు కారణాలు పార్టీ సిద్ధాంతాలు అజెండా వచ్చే ఎన్నికల్లో ఎలక్షన్ గా ప్రజల్లోకి వెళ్ళనున్నది ఇప్పటిదాకా రాజకీయ పార్టీల వైపు నుంచి వైఫల్యాలు తాను రాజకీయాల్లోకి వస్తే ఏం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు చెప్పనున్నారు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..