Vijay: రాజకీయాల్లోకి స్టార్‌ హీరో గ్రాండ్‌ ఎంట్రీ.. జెండా, అజెండా ఆవిష్కరించిన విజయ్‌..

|

Aug 22, 2024 | 10:27 AM

గురువారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో విజయ్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. ఎరుపు, పసుపు రంగులతో కూడిన ఈ జెండాలో రెండు ఏనుగులు, మధ్యలో వాగై పుష్పం ఉంది. వాగై అంటే మన దగ్గర రోడ్ల పక్కన నాటే దిరిసెన చెట్టు. తమిళంలో వాగై అంటే విజయానికి చిహ్నంగా భావిస్తారు. పార్వతీ దేవి మహిషాసురడిని సంహరించే ముందు...

Vijay: రాజకీయాల్లోకి స్టార్‌ హీరో గ్రాండ్‌ ఎంట్రీ.. జెండా, అజెండా ఆవిష్కరించిన విజయ్‌..
Tamilaga Vettri Kazhagam
Follow us on

రాజకీయాల్లోకి మరో హీరో ఎంట్రీ ఇచ్చారు. తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్‌ రాజకీయ పార్టీని ప్రారంభించారు. ‘తమిళగ వెట్రి కళగం ’ పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పార్టీకి సంబంధించిన జెండాను, పార్టీ అజెండాను ఆవిష్కరించారు.

గురువారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో విజయ్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. ఎరుపు, పసుపు రంగులతో కూడిన ఈ జెండాలో రెండు ఏనుగులు, మధ్యలో వాగై పుష్పం ఉంది. వాగై అంటే మన దగ్గర రోడ్ల పక్కన నాటే దిరిసెన చెట్టు. తమిళంలో వాగై అంటే విజయానికి చిహ్నంగా భావిస్తారు. పార్వతీ దేవి మహిషాసురడిని సంహరించే ముందు ఈ వాగై చెట్టు కింద శివుడి కోసంతప్పు చేశారని తమిళ పురాణాలు చెప్తాయి. వేదికపై ముందు పార్టీ జెండా విడుదల చేసిన విజయ్‌, ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక 40 అడుగుల స్తంభంపైన పార్టీ జెండా ఎగరవేశారు.

అనంతరం విజయ్‌ పార్టీ గీతాన్ని కూడా విజయ్‌ చేశారు. పార్టీకి సంబంధించిన ఈ కీలక కార్యక్రమంలో విజయ్‌ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. వివేక్‌ రాసిన ఈ పాటకు సంగీతాన్ని తమన్‌ అందించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం విజయ్‌ పార్టీ కార్యకర్తలతో కలిసి.. ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌.. ‘దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షకు మేం తొలగిస్తాం. ప్రజల్లో అవగాహన కల్పించి అందరికీ సమానహక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తాం. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తాం’ అని తన పార్టీ అంజెండాను ప్రకటించారు.

వచ్చే ఏడాది తమిళ నాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలే లక్ష్యంగా విజయ్‌ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయని విజయ్‌.. తన మద్ధతును ఏ పార్టీకి కూడా అందించలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ఆ సమయంలోనే స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా తాజాగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..