Hero Vijay: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంచలన ఫలితాలు
తమిళ స్టార్ హీరో విజయ్ చడీచప్పుడు కాకుండూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. తమిళనాడు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చత్తా చాటాడు. ఇప్పుడు ఇదే తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తమిళ స్టార్ హీరో విజయ్ చడీచప్పుడు కాకుండూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. తమిళనాడు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చత్తా చాటాడు. ఇప్పుడు ఇదే తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ రాష్ట్రంలో ఇటీవల 9 జిల్లాల్లో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ అభిమానుల సంఘం (ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం) అనూహ్య విజయం సాధించింది. విజయ్ అభిమానుల సంఘం ప్రతినిధులు 169 స్థానాల్లో పోటీ చేయగా.. ఏకంగా 115 స్థానాల్లో విజయం సాధించారు. అంటే 68 శాతం మేర విజయం సాధించడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత..తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ బేస్ హీరో విజయ్‌కుందన్న ప్రచారం చాలా రోజులుగా ఉంది. దీన్ని నిజం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన అభిమానుల సంఘం అనూమ్య విజయాన్ని నమోదు చేసుకుంది. వాస్తవానికి తన అభిమానుల సంం తరఫున విజయ్ ఎలాంటి ప్రచారం, ప్రకటనలు చేయకుండానే ఈ విజయం సాధించడం విశేషం. తన అభిమానుల సంఘానికి చెందిన ప్రతినిధులు స్థానిక సంస్థల ఎన్నికల పోటీ చేసేందుకు విజయ్ తొలిసారిగా అనుమతి ఇచ్చారు.
విజయ్ అభిమానుల సంఘం ప్రతినిధులు 13 చోట్ల ఏకగ్రీవ విజయం సాధించినట్లు ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం ప్రధాన కార్యదర్శి ఆనంద్ తెలిపారు. 115 చోట్ల విజయం సాధించగా.. ఇందులో 45 మంది మహిళలు ఉన్నట్లు వివరించారు. అన్ని వర్గాలకు చెందిన వారు విజయ్ అభిమానుం సంఘం తరఫున పోటీ చేసి విజయం సాధించారని తెలిపారు. విజయం సాధించిన వారిలో విద్యార్థులు, వ్యాపారులు, స్కూల్ టీచర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నట్లు వివరించారు. ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి అద్భుత ఫలితాలు సాధించినట్లు సంతృప్తి వ్యక్తంచేశారు. భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కీలక పాత్ర పోషించనున్నారని.. ఈ ఫలితాలు దీనికి సంకేతంగా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఆమోదం తెలిపిన విజయ్.. విద్యావంతులైన యువకులకు, పురుషులకు సమాన స్థాయిలో మహిళలకు టికెట్లు ఇవ్వాలని మాత్రమే సూచించినట్లు ఆనంద్ వెల్లడించారు.
దీంతో విజయ్ త్వరలోనూ పూర్తిస్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశముందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజకీయ వర్గాలు విజయ్ వైపే దృష్టిసారిస్తున్నాయి.
Also Read..
Ayodhya: అయోధ్యలో కలకలం.. దుర్గా పూజ మండపం వద్ద కాల్పులు.. ఒకరు మృతి..