చేతులు జోడించి వేడుకున్న సోనూసూద్

| Edited By: Venkata Narayana

Sep 29, 2020 | 10:51 AM

ప్రముఖ నటుడు, స్వచ్ఛంద సేవకుడు సోనూ సూద్ పర్యావరణ పరిరక్షణకోసం మొక్కలు నాటారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో భాగంగా సోనూ ఈ పనికి పూనుకున్నారు.

చేతులు జోడించి వేడుకున్న సోనూసూద్
Follow us on

ప్రముఖ నటుడు, స్వచ్ఛంద సేవకుడు సోనూ సూద్ పర్యావరణ పరిరక్షణకోసం మొక్కలు నాటారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా సోనూ ఈ పనికి పూనుకున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను స్వీకరించిన తాను మొక్కలు నాటినట్లు సోను తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.

కరోనా, తదనంతర కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత మరింత పెరిగిందన్న ఆయన.. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేనూ ఒకరిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షణకు తమవంతు బాధ్యత నెరవేర్చాలని సోనూ సూద్ పిలుపునిచ్చారు.

కరోనా కష్టకాలలో విద్యార్థులను ఫీజుల కోసం వేధించవద్దని ఆయన ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు విన్నవించారు. ఫీజు చెల్లించలేదంటూ వారి ఆన్‌లైన్ తరగతులను దయచేసి ఆపవద్దని ఆయన కోరారు. ప్రస్తుత సంక్షోభం నుంచి తిరిగి పుంజుకునేంతవరకూ విద్యార్థుల తల్లిదండ్రులకు కొంత సమయం ఇవ్వండి.. మీరిచ్చే ఈ చిన్న మద్దతు చాలా మంది చిన్నారుల జీవితాలను పరిరక్షిస్తుందని సోనూ సూద్ అన్నారు. అంతేకాకుండా మీరు చేసే సాయం మనుషుల్లో మానవత్వాన్ని మరింత పెంచుతుందని ఆయన చేతులు జోడించి మరీ పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలను అభ్యర్థించారు.