బిగ్‌ అప్డేట్‌.. ఆపరేషన్‌ సిందూర్‌లో IC-814 విమాన హైజాక్‌ సూత్రధారి అబ్దుల్ రవూఫ్ అజార్ హతం!

భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో జైష్-ఎ-మొహమ్మద్ సంస్థకు చెందిన ముఖ్య కమాండర్ అబ్దుల్ రౌఫ్ అజార్ మరణించాడు. అతను 1999 IC-814 విమానం హైజాకింగ్ లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఆపరేషన్ లో లష్కర్-ఎ-తోయిబా, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన వందలాది మంది ఉగ్రవాదులు చనిపోయారు.

బిగ్‌ అప్డేట్‌.. ఆపరేషన్‌ సిందూర్‌లో IC-814 విమాన హైజాక్‌ సూత్రధారి అబ్దుల్ రవూఫ్ అజార్ హతం!
Abdul Rauf Azhar

Updated on: May 08, 2025 | 2:15 PM

జైష్-ఎ-మొహమ్మద్ సీనియర్ కమాండర్, 1999లో IC-814 విమానం హైజాకింగ్ వెనుక ప్రధాన సూత్రధారి అయిన అబ్దుల్ రవూఫ్ అజార్ ఆపరేషన్ సిందూర్‌లో మరణించాడని ప్రభుత్వ ఉన్నత వర్గాలు ధృవీకరించాయి. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు అయిన అజార్, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ అంతటా భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో మరణించాడు. ఆపరేషన్‌ సిందూర్‌ సాధించిన విజయంలో ఇది కూడా ప్రధాన భాగంగా చెప్పుకోవచ్చు.

సరిహద్దు ఉగ్రవాద దాడులను నిర్వహించడంలో అతని దీర్ఘకాల పాత్రను దృష్టిలో ఉంచుకుని, అతని మరణం భారత భద్రతా సంస్థలకు ఒక పెద్ద ముందడుగు. అజార్‌ను ఐక్యరాజ్యసమితి, అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి. దాడుల సమయంలో ధ్వంసమైన జెఎం-సంబంధిత ఉగ్రవాద శిక్షణా కేంద్రాలలో ఒకదానిలో అతని ఉనికిని నిర్ధారించినట్లు సమాచారం.

ఆపరేషన్ సిందూర్‌లో భారత బలగాలు కీలక ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లను టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో 100 మంది లష్కర్‌ ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. వారిలో కొందరి ఫోటోలు బయటకొచ్చాయి. వికాస్‌, హసన్‌, ముదస్సిర్‌, హఫీజ్‌ అబ్దుల్‌ మాలిక్‌, షాహీన్‌ మక్సూద్‌ వీరంతా భారత్‌ వైమానికి దాడుల్లో చనిపోయిన వారే. కాగా, పాకిస్తాన్‌లో మొత్తం 840 ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిగిన వైమానిక దాడుల్లో 100 మందిపైగా ఉగ్రవాదులు మరణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..