AAP: జైలులో మసాజ్ లు, వీఐపీ ట్రీట్మెంట్.. ఆప్ మంత్రి భోగాలు చూస్తే నివ్వెరపోవాల్సిందే..

|

Nov 19, 2022 | 12:27 PM

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా ఆయనకు జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తూ....

AAP: జైలులో మసాజ్ లు, వీఐపీ ట్రీట్మెంట్.. ఆప్ మంత్రి భోగాలు చూస్తే నివ్వెరపోవాల్సిందే..
Satyendra Jain
Follow us on

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా ఆయనకు జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తూ.. మసాజ్ చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. మంత్రికి జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారనే ఇటీవల తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇది చోటు చేసుకోవడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలు గదిలో మసాజ్ చేయించుకుంటున్న పాత వీడియోను బీజేపీ శనివారం విడుదల చేసింది. తీహార్ ఢిల్లీ ప్రభుత్వంలో ఉంది. సత్యేంద్ర జైన్ అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. తీహార్ జైలులో జైన్‌కు ప్రత్యేక గౌరవం లభిస్తోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీలోని కోర్టులో పేర్కొంది. జైన్‌కు మసాజ్‌లు, ఫుట్ మసాజ్‌లు చేస్తున్నారని.. కర్ఫ్యూ సమయాలను దాటి కూడా అతనికి ప్రత్యేక ఆహారాన్ని అందించారని ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు. మనీ లాండరింగ్ కేసుకు వ్యతిరేకంగా జైన్ చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ తన వాదనలను ముగించే సమయంలో ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధుల్ వద్ద ఈడీ ఈ అభ్యర్థన చేసింది.

జైన్ తాను ఉన్న గదిలో బాడీ మసాజ్ చేస్తున్న దృశ్యాన్ని కూడా దర్యాప్తు సంస్థ సమర్పించింది. గుర్తుతెలియని వ్యక్తి జైన్‌కు పత్రాలు కూడా అందజేస్తున్నట్లు తెలిపింది. సహ నిందితుడు అంకుష్ జైన్ పర్యవేక్షణలో ఒక వ్యక్తి జైన్ గదిని శుభ్రం చేస్తున్నారని, పేర్కొంది. బెడ్‌షీట్లు, దిండు కవర్లు కూడా మారుస్తున్నట్లు సమాచారం. జైన్ జైలులో వివిధ సౌకర్యాలను అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని సీసీ కెమరా వీడియోలు చూపించి.. సత్యేందర్ జైన్ జైలులో ఎక్కువ సమయం వివిధ విలాసాలు అనుభవిస్తున్నాంటూ కోర్టుకు వెల్లడించారు.

కాగా.. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్‌ అయిన సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక జడ్జి జస్టిస్ వికాస్‌ ధుల్, సత్యేంద్రకు బెయిల్‌ మంజూరు చేయలేదు. కోర్టు సత్యేంద్ర బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడం ఇది రెండోసారి. జూన్‌ నెలలో కూడా ఆయన బెయిల్‌ దరఖాస్తుని న్యాయస్థానం కొట్టేసింది. ఇదే కేసులో అరెస్ట్‌ అయి బెయిల్‌ కోసం ఎదురుచూస్తున్న వైభవ్‌ జైన్‌, అంకుశ్‌ జైన్‌లకు కూడా బెయిల్ రాలేదు. మనీలాండరింగ్ కేసులో మే 30న సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..