Kareena Son Name: సైఫ్‌, కరీనాల తనయుడి పూర్తి పేరు ఏంటి.? ఆరో తరగతి విద్యార్థులకు వింత ప్రశ్న..

|

Dec 25, 2021 | 7:05 PM

Kareena Son Name: ప్రశ్నాప్రతాల్లో కొన్ని రకాల ప్రశ్నలు అప్పుడప్పుడు వివాదాలకు దారి తీస్తుండడం సహజమైన విషయమే. ముఖ్యంగా జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నల్లో కొన్ని వింత..

Kareena Son Name: సైఫ్‌, కరీనాల తనయుడి పూర్తి పేరు ఏంటి.? ఆరో తరగతి విద్యార్థులకు వింత ప్రశ్న..
Follow us on

Kareena Son Name: ప్రశ్నాప్రతాల్లో కొన్ని రకాల ప్రశ్నలు అప్పుడప్పుడు వివాదాలకు దారి తీస్తుండడం సహజమైన విషయమే. ముఖ్యంగా జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నల్లో కొన్ని వింత ప్రశ్నలు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోన్న ఆరోతరగతి విద్యార్థులకు ఎదురైన ప్రశ్నకు అంతా షాక్‌ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో ఆరోతరగతి విద్యార్థులకు పరీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కరెంట్‌ అఫైర్స్‌ సెక్షన్‌లో భాగంగా బాలీవుడ్‌ కపుల్‌ సైఫ్‌, కరీనాల తనయుడి పూర్తి పేరు ఏంటి? అనే ప్రశ్న వచ్చింది.

ఈ ప్రశ్నను చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఖాండ్వాలో ఉన్న ఆ పాఠశాలకు అధికారులు నోటీసులు అందించారు. షోకాజ్‌ నోటీసుకి పాఠశాల యాజమాన్యం సమాధానం ఇవ్వాలని డిస్ట్రిక్ ఎడ్యుకేషన్ ఆపీసర్ సంజీవ్ భాలేరావ్ తెలిపారు. సరైన సమాధానం రాకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఇదిలా ఉంటే సైఫ్‌, కరీనాల తనయుడిని ‘జెహ్‌’గా పిలుచుకుంటారు. జెహ్‌ పూర్తి పేరు ‘జహంగీర్ అలీఖాన్‌’ అని ఈ జంట తర్వాత ప్రకటించారు. ఇక ఈ బాలీవుడ్‌ జంటకు మొదటి సంతానం తైమూర్‌ అనే విషయం తెలిసిందే.

Also Read: సొంత ఇంటి నిర్మాణం చేప‌డుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

AP MLA: నటుడిగా మారిన ఏపీ ఎమ్మెల్యే.. ఆ సినిమాలో కీ రోల్.. ఎవరో గుర్తుపట్టారా..?

Vijay Devarakonda: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే : విజయ్ దేవరకొండ