OTT: పోగాకు హెచ్చరికల నింబంధనపై స్పందించిన పలు ఓటీటీ కంపెనీలు.. ఏమన్నాయంటే

|

Jun 03, 2023 | 6:50 PM

ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ థియేటర్ల తరహాలోనే ఓటీటీల్లోను పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరిగా వేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. వెబ్ సిరీస్‌లు, సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాల్లో ఈ నిబంధనలు అమలుచేయలాని సూచించింది.

OTT: పోగాకు హెచ్చరికల నింబంధనపై స్పందించిన పలు ఓటీటీ కంపెనీలు.. ఏమన్నాయంటే
Ott
Follow us on

ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ థియేటర్ల తరహాలోనే ఓటీటీల్లోను పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరిగా వేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. వెబ్ సిరీస్‌లు, సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాల్లో ఈ నిబంధనలు అమలుచేయలాని సూచించింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నిబంధనను తెచ్చిన కేంద్రం.. ఓటీటీల్లో కార్యక్రమం ప్రారంభానికి ముందు, మధ్యలో కనీసం 30 సెకన్ల పాటు పొగాకు పొగాకు దుష్రభావాన్ని వివరించేలా ప్రకటన ఉండాలని ఓటీటీలకు సూచించింది. అలాగే వాటి వాడకాన్ని చూపే దృశ్యాలు వచ్చినప్పుడు కూడా డిస్‌క్లెయిమర్‌ను చూపించాలని పేర్కొంది. ఈ హెచ్చరికలు కూడా ఆ కంటెంట్ ప్రసారమయ్యే భాషలోనే ఉండాలని చెప్పింది.

అయితే ఈ నిబంధనలపై పలు ఓటీటీ కంపెనీలు స్పందించాయి. దీని అమలుపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే లక్షలాది గంటల కంటెంట్ ఉందని.. ఈ హెచ్చరికలను జోడించడం కోసం ఎడిట్ చేయడాన్ని భారంగా భావిస్తున్నాయి. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ, జియో సినిమాకు చెందిన ప్రతినిధులు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో న్యాయపరంగా ఎలా వెళ్లాలనేదానిపై చర్చించారని సమాచారం. ముఖ్యంగా ఐటీ, సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ కాకుండా ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నిబంధనను ఆదేశించని నేపథ్యంలో దీనిపై సవాలు చేయాలని నిర్ణయించనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి