National: నడి రోడ్డుపై నగ్నంగా పరిగెత్తుతూ హంగామా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.

|

Mar 16, 2023 | 10:11 AM

నడి రోడ్డుపై నగ్నంగా పరిగెత్తుతూ నానా హంగామా చేశాడో వ్యక్తి. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గురుగ్రామ్‌లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

National: నడి రోడ్డుపై నగ్నంగా పరిగెత్తుతూ హంగామా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Representative Image
Follow us on

నడి రోడ్డుపై నగ్నంగా పరిగెత్తుతూ నానా హంగామా చేశాడో వ్యక్తి. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గురుగ్రామ్‌లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి సెక్టార్‌ 69లోని తులిప్‌ చౌక్‌ వద్ద నగ్నంగా రోడ్డు మధ్యలో పరిగెత్తాడు.

దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అనంతరం రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న ఒక గ్రామం వైపు వెళ్లాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే స్థానికంగా ఉన్న ప్రజలు సదరు వ్యక్తిని పట్టుకొని, చెట్టుకు కట్టేశారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి నైజీరియాకు చెందిన వాడిగా అనుమానిస్తున్నారు.

అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం సెక్టార్‌ 10లోని సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. ఒకవేళ అతని మానసిక పరిస్థితి నిలకడగా ఉంటే అతనిపై కేసు నమోదు చేస్తామని బాద్‌షాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ఇన్‌స్పెక్టర్‌ మదన్‌లాల్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..