Mumbai: తన బైక్‌ను తానే దొంగిలించిన యువకుడు.. తిక్క కుదిర్చిన పోలీసులు..

|

Mar 25, 2023 | 10:16 PM

ఎవరైనా వేరేవాళ్ల బైక్‌లను, కార్లను దొంగతనం చేస్తారు. కానీ, ఈ ఘనుడు మాత్రం తన బైక్‌ను తానే దొంగిలించాడు. ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఆ యువకుడు తన బైక్‌ను తానే ఎందుకు దొంగిలించాడు? అసలేం జరిగింది? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Mumbai: తన బైక్‌ను తానే దొంగిలించిన యువకుడు.. తిక్క కుదిర్చిన పోలీసులు..
Bike Theft
Follow us on

ఎవరైనా వేరేవాళ్ల బైక్‌లను, కార్లను దొంగతనం చేస్తారు. కానీ, ఈ ఘనుడు మాత్రం తన బైక్‌ను తానే దొంగిలించాడు. ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఆ యువకుడు తన బైక్‌ను తానే ఎందుకు దొంగిలించాడు? అసలేం జరిగింది? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ముంబై గోవండిలోని బైగన్‌వాడి ప్రాంతానికి చెందిన తారిక్ అహ్మద్ మక్సూద్ ఖాన్(24)కు బైక్ ఉంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పెండింగ్ చలాన్లు చెల్లించకపోవడంతో పోలీసులు అతని బైక్‌ని సీజ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో పార్కింగ్ ప్లేస్‌లో పెట్టారు. అయితే, తన బైక్‌ను తాను ఎలాగైనా తెచ్చుకోవాలని భావించిన మక్సూద్.. చోరీకి ప్లాన్ చేశాడు. పోలీస్ స్టేషన్‌ పార్కింగ్ లాన్‌లో ఉన్న తన బైక్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ వేశాడు.

ఆజాద్ మైదాన్ ట్రాపిక్ చౌకీలో పార్క్ చేసిన బైక్‌ను ఎత్తుకెళ్లేందుకు మక్సూద్ పక్కా ప్లాన్ ప్రకారం ప్రయత్నించాడు. ప్లాన్ సక్సెస్ అయ్యింది. బైక్‌ను తీసుకెళ్లాడు. అయితే, బైక్ మిస్ అవడాన్ని పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేపట్టారు. విచారణలో.. మక్సూదే బైక్‌ను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. అతన్ని పట్టుకుని విచారించగా.. నిజాన్ని అంగీకరించాడు. దాంతో మక్సూద్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..