
ఉత్తరప్రదేశ్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. భార్య చికెన్ వండలేదన్న మనస్తాపంతో భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే ఝాన్సీ జిల్లా ప్రేమ్‌నగర్‌లోని పవన్, ప్రియాంక అనే దంపతులు ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితమే వీళ్లకు వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. పవన్ స్థానికంగా ఉన్న ఓ ఫర్నీటక్ షాప్‌లో పనిచేస్తున్నాడు. అయితే ఇతనికి తాగుడు అలవాటు ఉంది. తరచుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం రోజున రాత్రి పవన్ మద్యం సేవించాడు. ఇంటికి వచ్చి భార్యను చికెన్ కూర వండమన్నాడు.
అయితే ఆమె కూర వండేందుకు నిరాకరించింది. అప్పటికే వంట చేసేశానని చెప్పింది. ఇక వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ తర్వాత ప్రియంక తన కుమార్తెతో కలిగి గదిలోకి వెళ్లి నిద్రపోయింది. భార్య పడుకున్న తర్వాత పవన్ వేరే గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొద్ది సేపటి తర్వాత పవన్ సోదరుడు వచ్చి చూశాడు. అప్పటికే పవన్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కేవలం చికెన్ వండని కారణంగా భార్యభర్తల మధ్య గొడవ జరగడం.. ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..