Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పిపోయిందనుకున్న భార్య ఇన్‌స్టాలో పోస్ట్‌.. అసలు విషయం తెలిసి కంగుతిన్న భర్త.

వివరాల్లోకి వెళితే.. దావణ గెరెకు చెందిన స్నేహ అనే 25 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం ప్రశాంత్‌ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. దావణగెరెలో అద్దె ఇంట్లో కాపురానికి దిగారు. అనంతరం రెండు నెలల క్రితం తాను గర్భిణి అయ్యానని, పుట్టింటికి వెళ్తాలనని చెప్పి వెళ్లిపోయింది. అనంతరం ఎన్నిసార్లు ఫోన్‌ చేసి, ఇంటికి రమ్మని అడిగినా స్నేహ అందుకు నిరాకరిస్తూ వచ్చింది. దీంతో అనుమానం...

తప్పిపోయిందనుకున్న భార్య ఇన్‌స్టాలో పోస్ట్‌.. అసలు విషయం తెలిసి కంగుతిన్న భర్త.
Wife
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 30, 2023 | 1:23 PM

సమాజంలో రోజురోజుకీ విలువలు దిగజారిపోతున్నాయి. అత్యాశ, అతి కోరిక ఈ రెండు మనిషి విచక్షతను కోల్పోయేలా చేస్తుంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, జల్సా జీవితాన్ని గడపాలన్నా అత్యాశతో తప్పుడు దారి తొక్కుతున్నారు. తాజాగా కర్నాకటలోని దావణగెరెలో జరిగిన ఓ సంఘటన సమాజంలో పతనమవుతోన్న విలువలకు పరాకాష్టగా నిలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. దావణ గెరెకు చెందిన స్నేహ అనే 25 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం ప్రశాంత్‌ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. దావణగెరెలో అద్దె ఇంట్లో కాపురానికి దిగారు. అనంతరం రెండు నెలల క్రితం తాను గర్భిణి అయ్యానని, పుట్టింటికి వెళ్తాలనని చెప్పి వెళ్లిపోయింది. అనంతరం ఎన్నిసార్లు ఫోన్‌ చేసి, ఇంటికి రమ్మని అడిగినా స్నేహ అందుకు నిరాకరిస్తూ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన ప్రశాంత్‌ స్నేహ చెప్పిన చిరునామాకు వెళ్లి చూడగా ఆమె అక్కడ లేదు.

ఈ క్రమంలోనే స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో చూసిన ప్రశాంత్‌ ఒక్కసారిగా నివ్వెరపోయాడు. స్నేహ మరో వ్యక్తిని వివాహం చేసుకున్న ఫొటో పోస్ట్ చేయడంతో కంగుతిన్న ప్రశాంత్‌ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో కంగుతినే విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్నేహ అంతకు ముందు కూడా రెండు వివాహాలు చేసుకున్నట్లు తేలింది.

బెంగళూరుకు చెందిన రఘు అనే యువకుడిని ఆమె వివాహం చేసుకుననట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఆమెకు మేలుకొటె నివాసి మహేత్‌తో మొదట వివాహం చేశారు. అయితే అతన్ని విడిచిపెట్టిన స్నేహ.. బెగళూరుకు చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఇక ఆ తర్వాత దావణగెరెకు చెందిన ప్రశాంత్‌ను వివాహమాడింది. ఇప్పుడు రఘు అనే మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రశాంత్‌ ఇచ్చిన ఫిర్యాదుతో స్నేహను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భవిష్యత్తులో తనలా మరెవరు మోసపోకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రశాంత్‌ చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ