Meghalaya: మేఘాలయలో భూకంపం.. ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు..

|

Feb 28, 2023 | 11:30 AM

టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు సంభవించిన తర్వాత.. మనదేశంలోనూ ఈ ప్రమాదాలు జరుగుతాయని భూగర్భశాస్త్ర నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. వీటిని నిజం చేస్తూ.. ఉత్తర భారతంలో..

Meghalaya: మేఘాలయలో భూకంపం.. ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు..
Earthquake
Follow us on

టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు సంభవించిన తర్వాత.. మనదేశంలోనూ ఈ ప్రమాదాలు జరుగుతాయని భూగర్భశాస్త్ర నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. వీటిని నిజం చేస్తూ.. ఉత్తర భారతంలో అక్కడక్కడ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాజాగా.. మేఘాలయలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.7గా నమోదైంది. భూకంపం రావడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

కాగా.. గతంలోనూ మేఘాలయలో భూకంపాలు వచ్చాయి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో 3.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో షిల్లాంగ్ వాసులు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. షిల్లాంగ్‌ ప్రాంతానికి ఆగ్నేయం దిశలో రెండు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంపం లోతు 10 కి.మీ మేర ఉందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి