124 Year Old Woman Covid vaccine: 124 ఏళ్ల మహిళకు కోవిడ్ వ్యాక్సిన్.. క్షేమంగా… సురక్షితంగా ఉన్న వృద్దురాలు..

|

Jun 04, 2021 | 6:50 AM

COVID vaccine: ప్రపంచంలోనే అతి పెద్ద వయసున్న మహిళకు జమ్ముకశ్మీర్ డాక్టర్లు టీకా వేశారు. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన 124 ఏళ్ల మహిళ కొవిడ్ -19 వ్యాక్సిన్‌ అందించారు.

124 Year Old Woman Covid vaccine: 124 ఏళ్ల మహిళకు కోవిడ్ వ్యాక్సిన్.. క్షేమంగా... సురక్షితంగా ఉన్న వృద్దురాలు..
A 124 Year Old Woman From S
Follow us on

ప్రపంచంలోనే అతి పెద్ద వయసున్న మహిళకు జమ్ముకశ్మీర్ డాక్టర్లు టీకా వేశారు. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన 124 ఏళ్ల మహిళ కొవిడ్ -19 వ్యాక్సిన్‌ అందించారు. బారాముల్లా జిల్లా వాగూరాకు చెందిన ష్రాక్వారా బ్లాక్ ఈ మహిళను గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. డోర్-టు-డోర్ వ్యాక్సిన్ డ్రైవ్ చేస్తున్న సమయంలో ఈ మహిళకు టీకా వేసినట్లుగా శ్రాక్వర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తాజముల్ మాలిక్ చెప్పారు. 

“మేము 124 ఏళ్ల మహిళకు డోర్-టు-డోర్ డ్రైవ్ సమయంలో టీకాలు వేసాము. ఆమె ఆరోగ్యంగా ఉంది” అని పిహెచ్‌సి శ్రాక్వర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తాజముల్ మాలిక్ చెప్పారు. టీకాలు వేసిన వారిలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన వందేళ్లు దాటిన మహిళ ఉందని అధికారులు వెల్లడించారు. ఇంటింటికి టీకాలు వేసే ప్రచారంలో భాగంగా ష్రాక్వారా బ్లాక్ వాగూరా నివాసి రెహతీ బేగం తన మొదటి కోవిడ్ వ్యాక్సిన్ డోసును పొందారని తెలిపారు.

అయితే ఇప్పటికే కేంద్ర భూభాగంలో 9 వేల మందికి పైగా వ్యాక్సిన్ అందించినట్టు అక్కడి వైద్య అధికారులు తెలిపారు.  జమ్మూ కాశ్మీర్‌లోని 20 జిల్లాల్లో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులతో సహా మొత్తం 9,289 మందికి టీకాలు వేసినట్లు ప్రకటించారు. ఇప్పటివరకు యూటీలో 33,58,004 టీకాలను అందించినట్లుగా వెల్లడించారు.

ఆమె వయస్సు 124 సంవత్సరాలుగా తెలిపింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లెక్కల ప్రకారం.. జపనీస్ మహిళ కేన్ తనకా ప్రస్తుతం 118 సంవత్సరాల వయస్సు అని తెలిపింది. అయితే రెహతీ బేగం వయస్సుపై అధికారిక ప్రకటన ఆమె కుమారుడి రేషన్ కార్డుపై ఎంట్రీ ఆధారంగా ఇలా ఉంది.

దాని ప్రకారం ఆమె వయస్సు 124గా పేర్కొంది. ఆమె వయస్సుకు సంబంధించి రుజువు లేనందున అధికారిక ధృవీకరణ లేదు. ఆమె వయస్సు గురించి బృందం ఆమెను అడిగినప్పుడు.. 100 సంవత్సరాలు దాటిందని చెప్పింది.

ఇవి కూడా చదవండి : Nivetha Thomas: వ‌కీల్‌సాబ్ త‌ర్వాత మ‌రో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన నివేథా థామ‌స్‌.. ఈ సారి మ‌రో టాప్ హీరోతో..

Amitabh Bachchan: పెళ్లి రోజున అరుదైన ఫొటోను షేర్ చేసిని బిగ్‌బి.. వెల్లువెత్తిన అభిమానుల శుభాకాంక్షలు..