Harbhajan Kaur : స్కూల్ దగ్గర ఐస్‌క్రీమ్‌తో బిజినెస్ మొదలు పెట్టి ఈరోజు లక్షల్లో ఆర్జిస్తున్న 94 ఏళ్ల బామ్మ.. సక్సెస్ స్టోరీ

|

Feb 23, 2021 | 11:54 AM

కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నాడు శ్రీశ్రీ. ఎందుకంటే కొంత మంది యువకులు ఏవేవో చెయ్యాలని కలలు కంటారు.. అయితే ఆచరణలో వచ్చే సరికి ఏమీ చెయ్యకుండా అవకాశాలు లేవు అంటూ సాకులు చెబుతూ.. కాలం వెల్లదీస్తారు. ఒంట్లో సత్తా.. కష్టపడి ...

Harbhajan Kaur : స్కూల్ దగ్గర ఐస్‌క్రీమ్‌తో బిజినెస్ మొదలు పెట్టి ఈరోజు లక్షల్లో ఆర్జిస్తున్న 94 ఏళ్ల బామ్మ.. సక్సెస్ స్టోరీ
Follow us on

94 year old Harbhajan : కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నాడు శ్రీశ్రీ. ఎందుకంటే కొంత మంది యువకులు ఏవేవో చెయ్యాలని కలలు కంటారు.. అయితే ఆచరణలో వచ్చే సరికి ఏమీ చెయ్యకుండా అవకాశాలు లేవు అంటూ సాకులు చెబుతూ.. కాలం వెల్లదీస్తారు. ఒంట్లో సత్తా.. కష్టపడి పనిచేయగలిగిన చేవ ఉండి కూడా వృద్ధాగా కాలం గడిపేస్తుంటారు.. ఇలాంటి కొంతమంది యువకులకు ఇన్స్పిరేషన్ గా ఈ బామ్మ నిలుస్తున్నారు. జీవితంలో సక్సెస్ సాధించడానికి వయసు తో పనిలేదని.. ఆలోచన పనిచేయడంలో నిబద్దత ఉంటె చాలు అంటూ నిరూపించారు 94 ఏళ్ల హర్భజన్ కౌర్.

హర్భజన్ కౌర్ అనే 94 సంవత్సరాలు వయసులో ముని మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకునే వయసు. కానీ నాలుగేళ్ల కిందట హర్భజన్ పేరు మీదే స్టార్టప్ ప్రారంభించారు. ఈ బ్రాండ్ పేరుతో ఆమె ఐస్, పచ్చళ్లు అమ్మడం ప్రారంభించారు. ఓ స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ అమ్మడం ప్రారంభించారు. 2వేలు ఆదాయం వచ్చిందట. ఆ ఆనందంతో మరింతగా వ్యాపారాన్ని విస్తరించారు. పచ్చళ్లు చేయడం ప్రారంభించారు. ఆ పచ్చళ్ళు మంచి టేస్టీగా ఉండడమే కాదు.. నిల్వతో పాటు ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండడంతో.. చాలా మంది వాటిని మళ్లీ మళ్లీ కొనడం ప్రారంభించారు.

ఇక ఆ పచ్చళ్ళు మార్కెట్‌లో బ్రాండెడ్ పచ్చళ్ల కంటే తక్కువ ధరకే హర్భజన్ కౌర్ అమ్మడంతో.. వ్యాపారం బాగా విస్తరించింది. ఇప్పుడు ఆమె స్వీట్లు కూడా అమ్ముతున్నారు. ఛండీగఢ్‌లో హర్భజన్ ఓ బ్రాండెడ్ కంపెనీగా మారిపోయింది. యంగర్ జనరేషన్ కు ఆదర్శమైన ఈ 94ఏళ్ల బామ్మ.. స్టార్టప్ తో లక్షల్లో సంపాదిస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందించారు. ఈ సంవత్సరపు పారిశ్రామిక వేత్త హర్భజన్ కౌర్ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.సో ఎవరో వస్తారు ఎదో చేస్తారు అని ఎదురుచూడకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఈరోజు తనకంటూ ఓ పేజీలిఖించుకున్నారు ఈ బామ్మ

Also Read:

ఈరోజు విజయవాడ వేదికగా జాబ్ మేళా .. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకూ అర్హులు..

హిందీలో రెండో దృశ్యం చూపించనున్నారు.. దర్శకుడు మరణించాడుగా.. మరి ఎవరు తెరకెక్కిస్తారు.?