APSSDC Jobs Mela: ఈరోజు విజయవాడ వేదికగా జాబ్ మేళా .. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకూ అర్హులు..
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ పలు ఉద్యోగాలకు ప్రకటన రు రిలీజ్ చేసింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి happy minds , rayapati heights, kotha pantakaluva road, kanuru, crdaల్లో ఇంటర్వ్యూలు...
APSSDC Jobs Mela: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ పలు ఉద్యోగాలకు ప్రకటన రు రిలీజ్ చేసింది. తాజాగా విజయవాడ వేదికగా సీఆర్డీఏ పరిధిలోని పలు సంస్థల్లో ఉద్యోగం చేయదనాయికి నియమాలకలను చేపట్టనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి happy minds , rayapati heights, kotha pantakaluva road, kanuru, crdaల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఉద్యోగాల భర్తీకి వరుసగా ప్రకటనలు విడుదల చేస్తున్న విషయం ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావలసిందిగా అధికారులు సూచించారు.
ఉద్యోగాల్లో ఖాళీలు అర్హతల వివరాలు:
ఎయిర్ టెల్ పేమెంట్ బాంక్ లో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. వీటిని స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదవ తరగతి ఆ పై అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్ధ్యులు ఇంటర్వ్యూకు హాజరుకావలసిందిగా కోరుతున్నారు. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండవలెను. ఎంపికైన అభ్యర్థఉలు కృష్ణా జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులను పురుషులకు మాత్రమే అని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల నుంచి రూ. 14 వేల వరకు వేతనం ఉంటుంది. రూ. 6 వేల వరకు ఇన్సెంటీవ్స్ ఉంటాయి.
Phonepe Private LTD: ఈ కంపెనీ వారు విజయవాడలో పనిచేయదానికి 10 మంది అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ కి ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ అర్హత కలిగి ఫీల్డ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈరోజు ఇంటర్వ్యూకు హాజరు కాల్సిందిగా తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 17 వేల వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది.
Pex Advanced Geo Special Pvt Ltd AAG: ఈ కంపెనీలో విజయవాడ లో పని చేయడానికి అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిందిగా కోరుతున్నారు. 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. క్వాలిటీ కంట్రోలర్, అనలిస్ట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్, డిప్లొమో, గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 96 వేల నుంచి రూ. 1.44 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. పురుషులు, స్త్రీలు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.
Big Basket వ్యాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్, బైక్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో 25 పోస్టులను బిగ్ బాస్కెట్ వారు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఆపై విద్యార్హతలున్నవారు ఈ పోస్టుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 112,200 వరకూ వేతనం చెల్లించనున్నారు. ఇతర సదుపాయాలను కూడా ఇస్తారు.. ఇక అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 32 ఎల్లా వయస్సు వరకూ అర్హులు ఎంపికైన అభ్యర్థులు గుంటూరు, విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు పురుషులను మాత్రమే ఇంటర్వ్యూ కి ఆహ్వానిస్తున్నారు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.