AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ సమావేశం.. ఏయే అంశాలపై చర్చిస్తున్నారంటే..

ఏపీ కేబినెట్‌ భేటీ కొనసాగుతుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సహా..

సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ సమావేశం.. ఏయే అంశాలపై చర్చిస్తున్నారంటే..
K Sammaiah
|

Updated on: Feb 23, 2021 | 12:20 PM

Share

ఏపీ కేబినెట్‌ భేటీ కొనసాగుతుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సహా.. పలు కీలక అంశాలపై చర్చిస్తుంది. దాదాపు 23 అంశాలతో కూడిన అజెండాపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. మార్చిలో జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో ఆయా శాఖల డిమాండ్లను కేబినెట్‌ ముందుంచారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాబడి, ఖర్చులు, అప్పులపై ఇప్పటికే సీఎం జగన్‌ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులపై కేబినెట్‌ చర్చిస్తుంది.

కరోనా సంక్షోభంతో కుదేలైన రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంపైనా కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ ఖరారు అయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల మూడో వారంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశాలు ఉండడంతో.. దీనిపై కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన సీఎం.. ఈ అంశంపై కేబినెట్‌ భేటీలో సీరియస్‌గా చర్చిస్తున్నారు. ఇప్పటికే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలంటూ ప్రధానికి లేఖ రాసిన జగన్‌ మంత్రివర్గంలో తీర్మానం ద్వారా కేంద్రాన్ని మరోసారి కోరతారు.

ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే అంశంపైనా కేబినెట్‌లో చర్చిస్తున్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి పీఆర్సీ విషయమై అభిప్రాయాలు స్వీకరించారు. ఇందులో భాగంగా 30 శాతానికి అటు ఇటుగా పీఆర్సీ ప్రకటించే సూచనలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. దీనిపై కేబినెట్‌ భేటీ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు. మార్చి 4వ తేదీన తిరుపతి వేదికగా సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇప్పటికే ప్రభుత్వం అజెండా సిద్ధం చేసుకుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు.. ప్రత్యేక హోదా, విభజన హామీల పరిష్కారానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ప్రస్తావించాలని ప్రభుత్వం​ భావిస్తోంది.

మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల సమీక్ష, మార్చిలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు.. సంక్షేమ పథకాలతోపాటూ కీలక అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.

Read more:

చెరువు కొమ్ము తండాలో సందడి చేసిన మంత్రి.. వంట మనిషి పండగలో పాలుపంచుకున్న ఎర్రెబెల్లి