AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెరువు కొమ్ము తండాలో సందడి చేసిన మంత్రి.. వంట మనిషి పండగలో పాలుపంచుకున్న ఎర్రబెల్లి

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం.. తనను నమ్మిన వాళ్ళను అక్కున చేర్చుకోవడంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి..

చెరువు కొమ్ము తండాలో సందడి చేసిన మంత్రి.. వంట మనిషి పండగలో పాలుపంచుకున్న ఎర్రబెల్లి
K Sammaiah
|

Updated on: Feb 23, 2021 | 12:26 PM

Share

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం.. తనను నమ్మిన వాళ్ళను అక్కున చేర్చుకోవడంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టైలే వేరు. అందుకే అంతా ఆయన్ని దయన్నా! అని అప్యాయంగా, గౌరవంగా పిలుస్తారు. అందుకు తగ్గట్లుగా దయన్న సైతం మరింతగా జనం తలలో నాలుకలా మెదులుతుంటారు. తాజాగా నత తన వద్ద వంట మనిషిగా పని చేసే మాలో త్ శివ ఇంటికి వెళ్ళి వారి పండుగలో పాలు పంచుకున్నారు.

పర్వత గిరి మండలం చెరువు కొమ్ము తండా కు చెందిన మాలో త్ సొమ్లా కొడుకు శివ చాలా కాలంగా మంత్రి ఇంటివద్ద వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఈ రోజు సి కె తండా లో ఊరంతా దుర్గమ్మ పండుగ చేసుకుంటున్నారు. ఈ పండుగ కు రావాల్సిందిగా శివ మంత్రిని ఆహ్వానించారు. అయితే మంత్రి వివిధ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నారు. వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆరెఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం నల్లగొండలో ఉంది. ఆ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరు కావాల్సి ఉంది.

అయినా సరే, వంట మనిషి శివ కోరిక కాదనలేక తన కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా, మంగళవారం ఉదయం సి కే తండాకు వెళ్ళారు మంత్రి ఎర్రబెల్లి. అక్కడి దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అటు నుంచి శివ ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబంతో కాసేపు గడిపారు.అక్కడకు వచ్చిన తండా వాసులతో కలివిడిగా పలకరిస్తూ ఫోటోలు దిగారు. తనకు పరిచయం ఉన్న వాళ్ళతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కాసేపు తండాలో సందడి చేశారు. అందరికీ దుర్గమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా నల్లగొండ కు బయలుదేరారు. తమ తండాకు మంత్రి రావడంతో ఆ గిరిజనుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

మరోవైపు తన వెన్నంటే ఉండే తన వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ వడ్లకొండ పరమేశ్ పుట్టిన రోజు ఈ రోజే కావడంతో, అతడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశీర్వదించారు. అతనితో ఫోటో దిగారు. శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.