Chhattisgarh: ఎన్నికల వేళ బీజపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. తొమ్మిది మంది మావోలు మృతి

|

Apr 02, 2024 | 2:53 PM

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలోని లేంద్ర గ్రామ సమీపంలో అటవీ సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందగా..

Chhattisgarh: ఎన్నికల వేళ బీజపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. తొమ్మిది మంది మావోలు మృతి
Chhattisgarh Encounter
Follow us on

బీజాపూర్‌, ఏప్రిల్ 2: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలోని లేంద్ర గ్రామ సమీపంలో అటవీ సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. జిల్లా రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా)కి చెందిన సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ కోసం నిర్వహించారు.

అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడినట్లు సమాచారం. ఈ క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించిన నక్సల్స్‌పై పోలీస్‌ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో మావోలు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో తొమ్మిది మంది మావోలు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ తర్వాత ఘటనా స్థలంలో మెషిన్ గన్, మందుపాతరలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇతర ఆయుధాలతో సహా అనేక ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

కాగా బస్తర్ రీజియన్‌లో ఉన్న బీజాపూర్.. మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో దాదాపు 41 మంది నక్సలైట్లు మరణించినట్లు ఓ పోలీస్‌ అధికారి మీడియాకు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఈ ఎన్‌కౌంటర్ జరిగడం చర్చణీయాంశంగా మారింది. కాగా బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి

గత ఏడాది మార్చి నుంచి జూన్ వరకు బస్తర్ ప్రాంతంలోని భద్రతా దళాలపై పలుమార్లు నక్సల్స్‌ దాడులు జరిపారు. గత నెల బీజాపూర్‌లోని బాసగూడ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మరణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.