Cats And Dogs: ఇండియాలో 80 మిలియన్ల షెల్టర్ లేని కుక్కలు, పిల్లులు ఉన్నాయటా..

|

Nov 26, 2021 | 1:23 PM

స్టేట్ ఆఫ్ పెట్ హోమ్‌లెస్‌నెస్ ఇండెక్స్ నివేదిక ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని బయట పెట్టింది. ఇండియాలో నిరాశ్రయులైన 80 మిలియన్ల కుక్కలు, పిల్లులు ఉన్నాయని తెలిపింది. ఇవన్నీ వీధుల్లో నివసిస్తున్నాయని అంచనా వేసింది...

Cats And Dogs: ఇండియాలో 80 మిలియన్ల షెల్టర్ లేని కుక్కలు, పిల్లులు ఉన్నాయటా..
Dog
Follow us on

స్టేట్ ఆఫ్ పెట్ హోమ్‌లెస్‌నెస్ ఇండెక్స్ నివేదిక ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని బయట పెట్టింది. ఇండియాలో నిరాశ్రయులైన 80 మిలియన్ల కుక్కలు, పిల్లులు ఉన్నాయని తెలిపింది. ఇవన్నీ వీధుల్లో నివసిస్తున్నాయని అంచనా వేసింది. “రోసీ తన సర్వీస్‌లో లెక్కలేనన్ని మంది ప్రాణాలను కాపాడి ఉండవచ్చు, కానీ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో దానికి స్థానం లేకపోవడంతో దాన్ని వృద్ధాప్యంలో మా కేంద్రంలో మిగిలిపోయింది. మేము దానకి ఆశ్రయం కల్పించాం” అని SGACC డైరెక్టర్ అంబికా శుక్లా అన్నారు. “ప్రతిరోజు మేము పెంపుడు జంతువులను విడిచిపెట్టిన ఐదు-ఆరు కేసులను చూస్తాము.” అని చెప్పారు. తొమ్మిదేళ్ల లాబ్రడార్ రోజీని హర్యానా పోలీసులతో బాంబ్ స్నిఫర్‌గా సంవత్సరాలపాటు సేవలందించిన తర్వాత మంగళవారం సంజయ్ గాంధీ జంతు సంరక్షణ కేంద్రం సంరక్షణలో వదిలేశారు. సర్వీస్ పూర్తి చేసుకున్న కుక్కలను జంతు సంరక్షణ కేంద్రాలలో వదిలివేస్తారు.

పెట్ హోమ్‌లెస్‌నెస్ ఇండెక్స్‌లో భారతదేశం 10 పాయింట్లలో 2.4 పాయింట్లు సాధించింది. జంతు స్టెరిలైజేషన్, టీకాలు వేయడం, రేబిస్‌తో సహా కుక్కల వ్యాధులు ఎక్కువగా ఉండటంతో పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడడం లేదని. జంతు సంరక్షణకు అధిక వ్యయం కావడం కూడా ఒక కారణంగా ఉందని నివేదిక పేర్కొంది. పెంపుడు జంతువుల యజమానులలో 50 శాతం మంది జంతువులను వదులుకుంటున్నారని తెలిసింది. ప్రముఖ జంతు సంక్షేమ నిపుణుల సలహా మండలి భాగస్వామ్యంతో మార్స్ పెట్‌కేర్ ఇండియా విడుదల చేసిన ఇండెక్స్, భారతదేశంలో నిరాశ్రయులైన కుక్కలలో 82 శాతం వీధి కుక్కలుగా ఉన్నాయని పేర్కొంది.

జనాభాలో సగానికి పైగా,53 శాతం మంది కుక్కలు ప్రమాదకరమని, 65% మంది కుక్క కాటుకు భయపడుతున్నారని, 82% మంది వీధి కుక్కలను ఆశ్రయాల్లో ఉంచాలని అభిప్రాయపడ్డారు. మార్స్ పెట్‌కేర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గణేష్ రమణి మాట్లాడుతూ “ఇప్పటి వరకు, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో జంతువుల నిరాశ్రయతను ట్రాక్ చేయడానికి కచ్చితమైన మార్గం లేదు.

Read Also… Constitution Day: రాజ్యాంగాన్ని నిబద్ధతగా పాటిస్తున్నామా.. మనం ఎటువైపు వెళ్తున్నాం..