8 Yrs of Modi Govt: దేశ ప్రధాని నరేంద్రమోడీ (Narendr modi) 8 ఏళ్ల పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిరుపేదలకు, రైతులకు, విద్యార్థులకు అన్ని వర్గాల వారికి మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవడం దేశ ప్రజల నుంచే కాకుండా ప్రజం దేశాల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2021లో ఎన్నో పథకాలు, నూతన జాతీయ విద్యావిధానాన్ని (New National Education system) ప్రశపెట్టింది. మన దేశంలో దశాబ్దాల కాలంగా అమలవుతూ వచ్చిన విద్యావిధానంలో మార్పులు చేసింది మోడీ ప్రభుత్వం. గత విద్యావిధానం పరిస్థితుల్ని తిరగరాస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం 34 ఏండ్ల క్రితం నాటి ‘జాతీయ విద్యా విధానం 1986’ స్థానంలో ‘న్యూ నేషనల్ ఎడ్యుకేషన్పాలసీ(ఎన్ఈపీ) 2020’ ని తీసుకొచ్చింది. కొత్త విధానం పాఠశాల, ఉన్నత విద్యా రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలకు బాటలు వేసింది. అందరికీ సమాన విద్యా అవకాశాలు, అందుబాటులో విద్య, త్రిభాషా సూత్రం అమలు, మాతృభాషలో సాంకేతిక విద్యాబోధన లాంటి విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
జాతీయ నూతన విద్యా విధానం నవ భారత నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించనుంది. కొత్త విద్యా విధానం తీసుకొచ్చిన మార్పుల్లో మొట్టమొదటిది పూర్వ ప్రాథమిక విద్య. ఇప్పటి వరకు సాగిన10+2 విద్య స్థానంలో ‘ఎన్ఈపీ 2020’ కొత్తగా 5+3+3+4 విధానం తీసుకువచ్చింది. 3 నుంచి 8, 8 నుంచి -11, 11-నుంచి 14, 14- నుంచి18 సంవత్సరాల స్టూడెంట్స్కొత్త విద్యా విధానం పరిధిలోకి వస్తారు. అంతర్జాతీయంగా దీన్ని కీలకమైన, పిల్లల మానసిక వికాసానికి సరైన దశ అని గుర్తించారు.
మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. మోదీ ప్రభుత్వం రెండో సారి పదవిలోకి వచ్చిన తర్వాత కరోనా మహమ్మారి ప్రజలను తీవ్రంగా దెబ్బకొట్టింది. మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు మోడీ సర్కార్ మరిన్ని పథకాలను ప్రవేశపెట్టింది. కోవిడ్-19తో నెలకొన్న ఆర్థిక, వ్యక్తిగత భారాల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఈ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. పలు వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన పథకాలలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ స్కీమ్ నుంచి ఈ-శ్రమ్ పోర్టల్ వరకు ఉన్నాయి.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ:
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ స్కీమ్ (PMGKP: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా వైద్య కార్మికులు రాత్రింబవళ్లు పనిచేశారు. గత ఏడాదిలో జూన్‌లోనే ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ పథకాన్ని కరోనాతో పోరాడుతోన్న వైద్య కార్మికులకు మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. ఏప్రిల్ 24, 2021 నుంచి ఏడాది పాటు ఈ స్కీమ్ అమల్లో ఉంది. ముందుగా 90 రోజుల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఏమైనా వ్యక్తిగత ప్రమాదం జరిగితే వైద్య కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం లభిస్తుంది. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ప్రైవేట్ హెల్త్ వర్కర్లు అందరికీ ఈ పాలసీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
మరిన్ని8 Yrs Of Modi Gov వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి