
Jammu and Kashmir Road Accident: జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు లోయలో పడిన ఘటనలో 8 మంది మరణించగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కిష్త్వార్ జిల్లాలో ఛత్రు ప్రాంతం బోండా గ్రామ సమీపంలో టాటా సుమో కారు లోతైన లోయలో పడిపోయింది. ఈ కారులో 11 మంది ఉన్నారు. వీరిలో 8 మంది మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అధికార యంత్రాంగా హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుంది. ఆర్మీ సిబ్బంది, స్థానికులు కలిసి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. కిష్త్వార్ జిల్లాలోని బుండా ఛత్రు చంగా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న టాటా సుమో.. అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయినట్లు వెల్లడించారు. కారు లోయలో పడిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, కొంతసేపటికి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఓ బాలిక కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
J&K | So far 4 people are injured in a car accident in Bunda area of Chatroo in Kishtwar district. The injured have been shifted to a district hospital: J&K Police https://t.co/7wpIvvRzPB
— ANI (@ANI) August 30, 2022
కాగా.. ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..