Uttar Pradesh Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతిచెందడం కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో మరో 12 మందికిపైగా గాయాలయ్యాయి. మోరాదాబాద్‌ జిల్లాలోని ఖైర్‌ఖాతా గ్రామ సమీపంలోని దల్పత్‌పూర్‌-కాశీపూర్‌ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Uttar Pradesh Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
Truck Accident

Updated on: May 07, 2023 | 8:37 PM

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతిచెందడం కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో మరో 12 మందికిపైగా గాయాలయ్యాయి. మోరాదాబాద్‌ జిల్లాలోని ఖైర్‌ఖాతా గ్రామ సమీపంలోని దల్పత్‌పూర్‌-కాశీపూర్‌ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు, బంధువులంతా వ్యాన్‌లో బయలుదేరారు. ఇంతలో అతివేగంతో వెళ్తున్న ఓ ట్రక్కు..ఆ వ్యాన్‌ను ఢీకొని దానిపై బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో అధికారులు.. చాలా కష్టం మీద వారిని బయటకు తీశారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండు వాహనాల్లో ప్రయాణికులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..